కరోనా అక్కడే మొదలైంది. అక్కడి నుంచే మొత్తం ప్రపంచం అంతా వ్యాపించింది. ఇప్పుడు మరో కొత్త వైరస్ కు చైనా స్వాగతం చెబుతోందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. చైనాలో ఇన్ ఫ్లూయెంజా వైరస్ రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో అక్కడ ప్రజలు, ప్రభుత్వమే హడలెత్తిపోతున్నారు.
చైనాలోని జియాన్ సిటీలో మళ్ళీ లాక్ డౌన్ విధించారు. ఇన్ ఫ్లూయెంజా అనే కొత్త వైరస్ విజృంభిస్తుండడమే అందుకు కారణం. వారం రోజుల్లో ఇన్ ఫ్లూ యెంజా వైరస్ పాజిటివ్ రేటు 25.1 నుంచి 41.6 శాతానికి పెరిగిపోయింది. దీనిపట్ల చైనా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం కూడా ఆంధోలన వ్యక్తం చేస్తోంది.
కొత్త వైరస్ వ్యాప్తి పెరగకుండా ఉండేందుకు అక్కడి ప్రభుత్వం మళ్ళీ లాక్ డౌన్ విధించింది. సూళ్లు, వ్యాపార సంస్థలు మూసివేయాలని ఆదేశించింది. కరోనా టైమ్ లో తీసుకున్న జాగ్రత్తలే దీనికీ తీసుకోవాలని అందుకే లాక్ డౌన్ అంటోంది. కానీ అక్కడి ప్రజలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. లాక్ డౌన్ కంటే వ్యాక్సిన్ ఇవ్వడం మంచిదని వాళ్ళు అంటున్నారు. వ్యాపార కార్యకలాపాలు నిలిపివేస్తే చాలా ఇబ్బంది అని చెబుతున్నారు. జియాన్ నగరంలో దాదాపు 1.3 కోట్ల మంది నివసిస్తున్నారు.