టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ ఫరేఖ్ వేతనం భారీగా పెరిగింది. కేవలం ఒక్క ఏడాదిలోనే ఆయన వార్షిక వేతనం 43 శాతం పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో చేసిన కంపెనీ ఆయనకు రూ.49.7 కోట్లు చెల్లించగా… ఈ ఏడాది మొత్తంగా 43 శాతం పెరిగి రూ.71 కోట్లకు చేరుకున్నట్టు ఇన్ఫోసిస్ గురువారం వెల్లడించింది. గతేడాది పరేఖ్ అందుకున్న స్టాక్ ప్రోత్సాహకాలతో పరేఖ్ ఆదాయం భారీగా పెరిగింది. అంతేకాక ఆయన పనితీరు ఆధారంగా చెల్లించే వేరియబుల్ చెల్లింపు కూడా పెరిగినట్టు కంపెనీ తెలిపింది.
కొన్ని రోజుల క్రితమే ఇన్ఫోసిస్‌కు మరో ఐదేళ్ల పాటు సీఈవోగా సలీల్ పరేఖ్ ఎంపికయ్యారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు కాకుండా… బయట ఒక వ్యక్తి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఇన్నేళ్లు కొనసాగడం విశేషం. ప్రస్తుత పొడిగింపుతో 2027 మార్చి వరకు సలీల్ పరేఖ్నే ఇన్ఫోసిస్ సీఈవోగా, ఎండీగా ఉండనున్నారు. పరేఖ్ జనవరి 2018 నుండి ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.