Infosys Set To Boost IT Sector in AP With New Campus In Visakhapatnam
mictv telugu

విశాఖకు ఐటీ కళ.. 1000 మందితో ఇన్ఫోసిస్ ఆఫీస్..

June 21, 2022

Infosys Set To Boost IT Sector in AP With New Campus In Visakhapatnam

ఏపీలో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. టైర్-2 నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. ఈ మేరకు విశాఖలో విడతల వారీగా మూడు వేల సీటింగ్ కెపాసిటీ గల క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రతినిధులు వెల్లడించారు. తొలి ద‌శ‌లో 1,000 సీటింగ్ కెపాసిటీతో ఈ క్యాంప‌స్‌ను ఆ సంస్థ ప్రారంభించ‌నుంది. ఈ క్యాంపస్ ఏకంగా ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని స‌మాచారం. ఇటీవల ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో ఇన్ఫోసిస్ ప్రతినిధులు సమావేశమై క్యాంపస్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై చర్చించారు. విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటు చేయడంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఇక ఏపీలో శ్రీ సిమెంట్ లిమిటెడ్‌ మ‌రో భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌క‌టించింది. ప‌ల్నాడు జిల్లా ప‌రిధిలోని దాచేప‌ల్లిలో ఉన్న ఆ సంస్థ ప్లాంట్ విస్త‌ర‌ణ కోసం ఏకంగా రూ.2,500 కోట్ల మేర పెట్టుబ‌డి పెట్ట‌నుందని ఆ రాష్ట్ర ఐటీఈ అండ్ సీ డిపార్డ్ మెంట్ ట్విటర్ వేదికగా తెలిపింది.