30 వేల కోట్ల సంపద మటాష్.. - MicTv.in - Telugu News
mictv telugu

30 వేల కోట్ల సంపద మటాష్..

August 18, 2017

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ విశాల్ సిక్కా రాజీనామా ప్రభావం వెంటనే కనిపించింది. కంపెనీ షేర్ల విలువ శుక్రవారం భారీగా పతనమైంది. ఫలితంగా రూ. 30 వేల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. నిఫ్టీలోఒకదశలో షేరు విలువ 13 శాతం పతనమై రూ. 884కి పడిపోయింది. తర్వాత 9.5 శాతం నష్టంతో రూ. 923 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.2.34 లక్షల కోట్ల నుంచి రూ.2.04 లక్షల కోట్లకు పడిపోయింది.

కంపెనీలో పెద్దసంఖ్యలో వాటాలున్న సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి దాదాపు రూ.వెయ్యికోట్ల నష్టం వచ్చింది. అయినప్పటికీ ముందస్తు నిర్ణయం ప్ర్రకారం షేర్ల బైబ్యాక్ కు వెళ్తామని కంపెనీ చెప్పడం గమనార్హం.

మరోపక్క.. టీసీఎస్ షేరు బలం పుంజుకుంది. 1.13 శాతం లాభంతో కొనసాగి రూ. 2,513కు పెరగింది.