సుధామూర్తికి వింత అనుభవం..... - MicTv.in - Telugu News
mictv telugu

సుధామూర్తికి వింత అనుభవం…..

July 26, 2017

పైపై మెరుగులు చూసి భ్రమిస్తే బోర్లాపడటం ఖాయం. చాలా సార్లు బట్టలను చూసి… మనిషి రంగును చూసి ఓ అంచనాకు వచ్చేస్తుంటాం. ఇంకొన్ని సార్లు అయితే… కొందరు మాట్లాడ్తారు కదా…ఎహే… వాణ్ణి చూస్తనే అర్థం అయితే లేదా విషయం ఏమిటో అని సెలవిస్తారు… మేధావి ఫేసుతో. మరి కొంత మందైతే ఒక్క మెతుకు చాలు అన్నం మొత్తం చూడాల్నా అని కూడా అంటూ ఉంటారు. ఇలాంటి తక్షణం   నిర్ణయానికి వచ్చి  తీసుకునే నిర్ణయాలు.. చేసే కామెంట్లు ఎంత ప్రమాదమో ఈ స్టోరీ చదివితే క్లీయర్ గా  అర్థం అవుతుంది.

ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సతీమణి సుధామూర్తికి విచిత్రానుభవం ఎదురైంది. లండన్ లోని హిత్రూ విమానాశ్రయంలో హై హీల్స్ వేసుకున్న ఓకావిడ సుధామూర్తి వద్దకు వచ్చింది. మీరు కూర్చునేది ఇక్కడ కాదు.. ఎకనామీ క్లాసు లో అక్కడికి వెళ్లండని ఒకటికి రెండు సార్లు చెప్పిందట. అప్పుడు సుధామూర్తి సల్వార్ కమీజ్ డ్రెస్ లో ఉన్నారు.

ఇక్కడ సీన్ కట్ చేస్తే…..

ఆ తర్వాత కొంత సేపటికి హై హీల్స్ లేడీ.. సుధా మూర్తిని ఓ  సమావేశంలో చూశారు… అదీ ఆ  సమావేశానికి చీఫ్ గెస్ట్ ఆమెనే. అయితే ఈ హై హీల్స్ లేడీ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరఫున నిధులు అడిగేందుకు అక్కడికి వచ్చారట. ఈ విషయం తెలుసుకున్న సదరు లేడీ  హడలిపోయి ఉంటారు. అయితే ఈ విషయం గురించి సుధా మూర్తి తాను  రాసిన ‘‘త్రీ థౌజండ్ స్టిచెస్ ’’ లో  చెప్పారట. అయితే సమావేశానికి ఆ హై హీల్స్ లేడీ సాధారణ ఖద్దర్ దుస్తులు వేసుకుని వచ్చారని సుధామూర్తి చెప్పారు. తన వద్దకు డబ్బులు అడిగేందుకు వచ్చినామె అట్లా మాట్లాడటాన్ని ఆమె తప్పు పట్ట లేదు.  డబ్బులను బట్టి క్లాస్ ఉండదని చెప్పారు. డబ్బులుంటేనే విలువ, హోదా ఉంటాయనే పాత ఆలోచనలు చెప్పారు.

అందుకు డ్రెస్ ను బట్టి… చూపును బట్టి… ఓ నిర్ణయానికి వస్తే ఇబ్బందులు తప్పవు మరి.