Infosys Warns Employees Against Moonlighting, Says It Could Lead To Termination
mictv telugu

ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఇన్ఫోసిస్

September 13, 2022

కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన ఐటీ ఉద్యోగులు .. ఆ తర్వాత పగలు ఒకటి, రాత్రి ఒకటి చొప్పున రెండు ఉద్యోగాలు చేయటం ప్రారంభించారు. అయితే ఇది కంపెనీలకు చాలా ప్రమాదకరంగా మారింది. ఈ పద్ధతి మానుకోవాలని ఐటీ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చాయి. ఈ వ్యవహారంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఈ-మెయిల్ పంపటం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని వారాల క్రితం రెండు చోట్ల పని చేయడంపై ఇన్ఫోసిస్ తీవ్రంగా స్పందించింది. ఇలా చేయటం స్పష్టమైన స్కామ్ అని యాజమాన్యం అభిప్రాయపడింది. ఆ సందర్భంలో.. తమ ఉద్యోగులకు ప్రవర్తనా నియమావళి ప్రకారం మూన్‌లైట్ అనే రెండు ఉద్యోగాలు చేయడానికి అనుమతించబడదని ఇన్ఫోసిస్ తేల్చి చెప్పింది.

మూన్‌లైటింగ్‌ను(డ్యూయల్ ఎంప్లాయీమెంట్‌ను) మానుకోకపోతే.. ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుందని తెలిపింది. ఈ విషయంపై విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కూడా తన ఉద్యోగులపై బహిరంగంగానే మండిపడ్డారు. ఇది ‘ప్లెయిన్, సింపుల్ చీటింగ్’ అంటూ కోపోద్రిక్తులయ్యారు. తాజాగా ఇన్ఫోసిస్ సంస్థ కూడా తన ఉద్యోగులపై సీరియస్ అయింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ డ్యూయల్ ఎంప్లాయీమెంట్ చేస్తే.. క్రమశిక్షణా రహిత చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఎంప్లాయీమెంట్ టర్మినేట్ చేస్తామని చెప్పింది. ఈ విషయంపై ‘నో డబల్ లైవ్స్(రెండు జీవితాలు ఉండవు)’ అనే టైటిల్‌తో ఈ నెల 12న అంటే సోమవారం ఉద్యోగులకు లేఖ రాసింది.

కంపెనీలో షిఫ్ట్ ముగిసిన తర్వాత బయట కంపెనీలకు సంబంధించిన ఎలాంటి అసైన్ మెంట్స్ లేదా ప్లాజెక్టుల కోసం పనిచేయటం అనుమతించబడదని కంపెనీ స్పష్టం చేసింది. గతంలో విప్రో మూన్‌లైటింగ్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపిన తర్వాత తాజాగా ఇన్ఫోసిస్ తాజాగా ఈ ప్రకటన చేసింది.