ingrown hair symptoms,causes and remedies
mictv telugu

ఇన్ గ్రోన్ హెయిర్ అంటే ఏంటో తెలుసా?

January 6, 2023

ఇన్ గ్రోన్ హెయిర్….చలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది ఒకటి. అసలు ఇదొక సమస్య అని కూడా చాలా మందికి తెలియదు. కానీ దీనివలన బాధపడుతుంటారు. ఎందుకు వస్తుంది, ఎలా తొలగించుకోవాలి కూడా తెలియదు. అసలేంటీ ఇన్ గ్రోస్ హెయిర్, అదెలా పోతుందో ఇప్పుడు చూద్దాం.

వ్యాక్సింగ్ లేదా షేవింగ్ చేసిన తర్వాత మృదువైన చర్మం ఉంటుంది. కానీ కొంత మందికి వ్యాక్సింగ్, షేవింగ్ చేయడం వల్ల చర్మం మీద ర్యాషస్, దురద వంటి సమస్యలు వస్తాయి. మరికొంతమందిలో తిరిగి హెయిర్ పెరిగినప్పుడు చర్మం పైకు కాకుండా లోపలకి వెళుతుంది. దానినే ఇన్ గ్రోన్ హెయిర్ అని అంటారు. దీనికి కారణం డెడ్ స్కిన్.దీని వలన హెయిర్ బయటకు పెరగకుండా చర్మం లోపలకి వెళుతుంది. దీని వలన దురద రావడమే కాకుండా చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది.

ఇన్ గ్రోన్ హెయిర్ రావడానికి ఇంకొక కారణం హెయిర్ కర్ల్ అయి చర్మంలోకి వెళ్ళడం. ఇన్ గ్రోన్ హెయిర్ పోవాలంటే హాట్ కంప్రెస్‌ను ఉపయోగించవచ్చు. కానీ ఈ పద్ధతిను ఎంపిక చేసే ముందు డెర్మటాలజిస్ట్ సూచనలను ఖచ్చితంగా తీసుకోండి. ఇన్ గ్రోన్ హెయిర్ ను తొలగించడానికి మరొక పద్ధతి కూడా ఉంది అదే లేసర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్. దీంతో పాటూ కొన్ని రకాల స్కిట్ కేర్ తీసుకుంటే ఇన్ గ్రోన్ హెయిర్ రాకుండా ఉంటుంది లేదా వచ్చింది పోతుంది.

ఇన్ గ్రోన్ హెయిర్ తొలగించుకోవడానికి ఫిజికల్ ఎక్స్ఫోలియంట్‌తో వారానికి రెండు రోజులు ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవాలి.

కెమికల్ ఎక్స్ఫోలియంట్‌తో వారానికి ఒకసారైనా ఎక్స్‌ఫోలియేట్ చేయాలి.

ఎక్స్ఫోలియేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మాయిశ్చరైజ్ చేయాలి.

వ్యాక్సింగ్ లేక షేవింగ్ చేసుకునే ముందు గోరువెచ్చని నీటితో చర్మంను కడగాలి. హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు హెయిర్ గ్రోత్ అవుతున్న వైపుకు చేయాలి.

హెయిర్ రిమూవ్ చేయడానికి వ్యాక్సింగ్ లేక షేవింగ్ కంటే లేసర్ హెయిర్ రిడక్షన్ పద్ధతి చాలా మంచిది.

పైవేవీ వర్కౌట్ అవ్వకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. లేదా ఎక్సపర్ట్ లను కలవాలి. సొతంతగా తెలిసీ తెలియకుండా ప్రయోగాలు మాత్రం చేయకూడదు. అలా చేస్తే మొత్తం స్కిన్నే పోయే ప్రమాదం ఉంది.