భారత్-శ్రీలంక మధ్య ఈడెన్ గార్డెన్స్ లో రెండో వన్డే కొనసాగుతుంది. టాస్ గెలిచి నిలకడగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక..భారత్ బౌలర్ల ధాటికి ఒకేసారి కుదేలైంది. వరుస వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం శ్రీలంక 29 ఓవర్లలో 156/7 స్కోర్ చేసింది. 16 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 99 పరుగులతో ఉన్న ప్రత్యర్థిని కుల్దీప్ యాదవ్ దెబ్బకొట్టాడు. 17 ఓవర్ చివరి బంతికి కుశాల్ మెండీస్ ఔట్ చేశాడు. తర్వాత అక్షర్ పటేల్ ఓవర్లో ధనంజయ డిసిల్వా బౌల్డయ్యాడు. ఇంతలోనే శ్రీలంకకు మరో షాక్ తగిలింది. ఆరంభం నుంచి అద్భుతంగా ఆడి అర్థసెంచరీ చేసిన ఫెర్నాండో(50) రనౌట్ అయ్యాడు. తర్వాత వెంట వెంటనే శనక, అసలంకను కుల్దీప్ పెవిలియన్‌కు పంపాడు.తర్వాత ధాటిగా ఆడుతున్న హసరంగా ఉమ్రాన్ బౌలింగ్ అక్షర్ పటేల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
కేవలం 50 పరుగుల వ్యవధిలోనే శ్రీలంక 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్‌లో కరుణరత్నే , వెల్లలాగె ఉన్నారు. చాహల్ స్థానంలో జట్టులోకి కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. స్పిన్‌కు అనుకూలిస్తున్న ఈడెన్ పిచ్‌పై శ్రీలంక బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. కుల్దీప్ ఇదే జోరు కొనసాగిస్తే శ్రీలంక తక్కువ స్కోరకే పరిమితం కావొచ్చు.