జంతువులకు కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. వేరియంట్లకు చెక్ - MicTv.in - Telugu News
mictv telugu

జంతువులకు కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. వేరియంట్లకు చెక్

June 10, 2022

కరోనా వ్యాక్సిన్ ఇప్పటివరకు మనుషుల కోసమే తయారు చేసి ఉపయోగించారు. ఇప్పుడు తొలిసారి జంతువుల కోసం కూడా కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైన ‘అనోకోవ్యాక్స్’ అనబడే ఈ వ్యాక్సిన్‌ను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్ కరోనాలోని డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లను సమర్ధవంతంగా ఎదుర్కోగలదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వెల్లడించింది. దీనిని హర్యానాకు చెందిన ఐసీఏఆర్ – నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈవ్విన్స్‌లు అభివృద్ధి చేశాయి. కుక్కలు, సింహాలు, చిరుతలు, ఎలుకలు, కుందేళ్లకు ఈ వ్యాక్సిన్ పని చేస్తుందని తెలిపాయి. వ్యాక్సిన్‌తో పాటు కుక్కలలో యాంటీబాడీలను గుర్తించే కిట్లను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా దిగుమతి చేసుకోకుండా దేశీయంగా వ్యాక్సిన్ తయారు చేయడం గొప్ప విషయమని మంత్రి అభినందించారు.