తెలంగాణ బిడ్డకు సాయం చేయండి - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ బిడ్డకు సాయం చేయండి

October 26, 2017

అమెరికాలో  ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన   తెలంగాణ అమ్మాయి  శ్రీలేఖ కు ఆర్థిక సాయం సాయం చేయటానికి  ఎన్నారైలు ఆన్ లైన్‌లో ప్రచారం ప్రారభించించారు.. ఖమ్మం  జిల్లా  మదిరకు  చెందిన  శ్రీలేఖ  న్యూయార్క్ లోని జాన్సెన్ స్ట్రీట్‌లో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా  వేగంగా వస్తున్న కారు ఢీకొంది.

ఆమె తీవ్రంగా  గాయపడింది. ప్రస్తుతం ,విల్సన్ మెమోరియల్  ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బ్యాంక్  రుణంతో అమెరికా‌లో  చదువు కుంటోంది  శ్రీలేఖ. ఆమె  తల్లి తండ్రులు పేదవారు. చావు తుకుల్లో వున్న శ్రీలేఖకు   బ్రెయిన్ సర్జరీ కూడా చేయాలని  డాక్టర్లు తెలిపారు. దీంతో మెడికల్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి.  

కాలిఫోర్నియాకి చెందిన గిరిధర్ వాసిరెడ్డి  శ్రిలేఖ  ఆసుపత్రి ఖర్చుల కోసం  క్రౌండ్ ఫండింగ్ పేరుతో క్యాంపెయిన్  చేస్తున్నారు.దాదాపు 5 గంటల్లోనే 59,511 డాలర్లను మొత్తం 1528 మంది వివారళం ఇచ్చారు. వైద్య ఖర్చులు కనీసం 1,00,000 డాలర్లు అయ్యే అవకాశం ఉంది. ఈ  క్యాంపయిన్  సక్సెస్ అయ్యి  శ్రీలేఖ  కోలుకొని తిరిగి తన చదువు కొనసాగించాలని  తల్లి తండులు  కోరుకుంటున్నారు.