కరోనాను కోరికోరి అంటించుకున్న ఖైదీలు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాను కోరికోరి అంటించుకున్న ఖైదీలు (వీడియో)

May 14, 2020

Coronavirus

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎక్కడ తమకు సోకుతుందోనని ప్రజలు భయాందోళనల నడుమ బిక్కుబిక్కుమంటున్నారు. కానీ ఓచోట మాత్రం జైల్లోని ఖైదీలు కావాలని కరోనాను అంటించుకుని చావునోట్లో నోరు పెడుతున్నారు. గుంపులుగా ఉంటే కరోనా సోకుతుందని భావించిన జైలు అధికారులు ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమను ఎందుకు విడుదల చేయట్లేదని ఆ ఖైదీలు అనుకున్నట్టున్నారు.. అంతే ఒకర్నొకరు కరోనాను అంటించుకుంటున్నారు. ఈ విచిత్ర ఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ జైలులో చోటుచేసుకుంది. జైలులో ఖైదీలు కరోనాను ఎలా అంటించుకుంటున్నారో, రికార్డయిన సీసీటీవీ దృశ్యాలను జైలు అధికారి అలెక్స్ విల్లా విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో.. ఒకరు తాగిన నీరు మరొకరు తాగుతూ, ఒకరు ముక్కు చీదిన మాస్కును మరొకరు ధరిస్తూ, ఉద్దేశపూర్వకంగా వైరస్‌ను అంటించుకున్నారు. కవాలని అవకాశం ఇస్తే కరోనా ఊరుకుంటుందా? చక్కగా వచ్చేయదూ.. దీంతో రెండు వారాల వ్యవధిలోనే 30 మంది ఖైదీలకు కరోనా మహమ్మారి అంటుకుంది. అయితే అధికారులు వారిని విడుదల చేయకుండా ట్విస్ట్ ఇచ్చారు. దీంతో వారి పాచిక గోడకు కొట్టిన బంతిలా తయారైంది. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, వీరిపై ఉద్దేశపూర్వకంగా వ్యాధిని వ్యాపించేలా చేసినందుకు కేసులు పెట్టామని వెల్లడించారు. కాగా, అమెరికాలోని జైళ్లలో ఇప్పటివరకు 25 వేల మందికి పైగా ఖైదీలకు కరోనా సోకగా.. సుమారు 350 మంది మృత్యువాత పడ్డారు.