INS Vikrant: PM Modi commissions largest ship ever built in India's maritime history
mictv telugu

తొలి బాహుబలి నౌక..జాతికి అంకితం: మోదీ

September 2, 2022

స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అత్యాధునిక యుద్దనౌక ఐఎన్ఎస్ విక్రాంత్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భారత అమ్ముల పొదిలోకి చేరింది. కేరళలోని కొచ్చి షిప్యార్డ్లో ఈ యుద్దనౌకను మోదీ.. జాతికి అంకితమిచ్చారు. బాహుబలి యుద్ధనౌకగా పేరుగాంచిన.. ఐఎన్ఎస్-విక్రాంత్ రాకతో హిందూ మహాసముద్ర జలాల్లో గస్తీ మరింత పటిష్ఠం కానుంది.

ఐఎన్ఎస్ విక్రాంత్‌ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..”కేరళ సముద్ర తీరంలో నవశకం ప్రారంభమైంది. INS విక్రాంత్ పై ఈ వేడుక ప్రపంచలో భారతదేశం సత్తా,ధైర్యాన్ని చూపుతుంది. విక్రాంత్ పెద్దది, గొప్పది. విక్రాంత్ విలక్షణమైనది, ప్రత్యేకమైనది. కేవలం యుద్ధనౌక మాత్రమే కాదు…21వ శతాబ్దపు భారతదేశ కృషి, ప్రతిభ, ప్రభావం ,నిబద్ధతకు నిదర్శనం. భారత్‌కు సాధ్యం కానిది ఏదీ లేదు, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ నౌకను చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని” అన్నారు.

కాగా విక్రాంత్‌ నౌక 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ నౌక గంటకు 28 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణించనుంది. దీని తయారీకి 13 ఏళ్ల సమయం పట్టగా.. రూ.20 వేల కోట్లు ఖర్చయ్యింది. 262 మీటర్ల పొడవు.. 62 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక బరువు 37,500 టన్నులు. ఇందులో మొత్తం 14 అంతస్తులు, 2300 కాంపార్ట్‌మెంట్స్‌ ఉన్నాయి. విధుల్లో 1600 మంది సిబ్బంది ఉంటారు.

దాదాపు ఏడాదిగా సముద్రంలో ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న INS విక్రాంత్ నౌకాదళంలో చేరింది…. బాహుబలి యుద్ధనౌకగా పేరుగాంచిన….ఐఎన్ఎస్-విక్రాంత్ రాకతో హిందూ మహాసముద్ర జలాల్లో భారత తీర ప్రాంతంలో మరింత బందోబస్తు పెరగనుంది. ఇప్పటిదాకా భారత్‌ వద్ద ఉన్న యుద్ధ నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అలాంటిది అగ్రదేశాలకు దీటుగా అత్యాధునిక విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ విజయవంతంగా నిర్మించింది.