'పిచ్చిదానివా? నీపై కేసు పెట్టాలి?'..వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

‘పిచ్చిదానివా? నీపై కేసు పెట్టాలి?’..వీడియో వైరల్

May 18, 2022

టిక్‌టాక్‌ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత్‌లో టిక్‌టాక్‌ యాప్ ద్వారా సామాన్య యువతి, యువకులు వీడియోలు చేసి రాత్రికి రాత్రే స్టార్లు అయిన వారు చాలా మంది ఉన్నారు. కొందరు మంచికోసం టిక్‌టాక్ యాప్‌ను ఉపయోగిస్తే, ఎక్కువ మంది చెడుకోసం ఉపయోగించారు. దాంతో ఆగ్రహించిన కేంద్ర ప్రభుత్వం.. టిక్‌టాక్‌ యాప్‌ను పూర్తిగా బ్యాన్‌ చేసింది. కానీ, కొన్ని విదేశాల్లో మాత్రం ఇప్పటికి ఈ (టిక్‌టాక్) యాప్‌ కొనసాగుతూనే ఉంది. తాజాగా పాకిస్తాన్‌ దేశానికి చెందిన ఓ యువతి టిక్‌టాక్‌లో షేర్ చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోను వీక్షిస్తున్న నెటిజన్స్ ఆమెపై తెగ విరుచుకుపడుతున్నారు.

 

స్టార్‌ హ్యుమైరా అస్గర్‌ అనే యువతి టిక్‌టాక్‌ ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో..హ్యుమైరా తగలబడుతున్న చెట్ల ముందు అందంగా తయారై, సుకుమారంగా నడుచుకుంటూ వెళ్తొంది. ‘నేనెక్కడ అడుగుపెడితే అక్కడ ఫైరే’ అన్న క్యాప్షన్‌తో వీడియోను షేర్‌ చేసింది. దాంతో ఆగ్రహించిన పర్యావరణ ప్రేమికులు ‘పిచ్చిదానివా? నీ వీడియో కోసం అడవిని తగలబెడతావా? నీపై కేసు పెట్టాలి’ అని కామెంట్స్ చేశారు. దాంతో హ్యుమైరా స్పందిస్తూ..” నేను చెట్లకు ఎటువంటి హాని తలపెట్టలేదు” అని చెప్పుకొచ్చింది. అయినా కోపం చల్లారని నెటిజన్లు ‘ఒకవేళ నువ్వు నిప్పు పెట్టకపోయినా అక్కడ తగలబడుతుంటే వీడియోలు తీసేబదులు నీళ్లు పోసి చల్లార్పవచ్చు కదా’ అని మండిపడుతున్నారు.