Inside the controversial plan to reintroduce cheetahs to India
mictv telugu

ఆ చిరుతలను తిరిగి ఇండియాకు తీసుకొస్తే.. జరిగేది ఇదే..

September 15, 2022

అరుదైన చిరుత పులులను కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికా ఖండం నుంచి మన దేశానికి తీసుకురానుంది. భారత్‌లో అంతరించిపోయిన ఆ అరుదైన చిరుత జాతిని తిరిగి వృద్ధి చేసే లక్ష్యంతో.. వాటి దిగుమతికి సంబంధించి భారత ప్రభుత్వం నమీబియాతో గతంలో ఓ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా నమీబియా నుంచి 5 మగ, 3 ఆడ చీతాలు ఈ నెల 17కల్లా కునో పార్కుకు చేరుకోనున్నాయి. అదే రోజున ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయన ‘చీతాల పునఃపరిచయ కార్యక్రమాన్ని’ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

దేశంలో ఆ అరుదైన చిరుత జాతి 1952లోనే అంతరించిపోయిందని, వాటి పునరుద్ధరణ కోసం పునరుత్పత్తి ప్రాజెక్టును చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని గురించి భారతీయ శాస్త్రవేత్త మరియు జంతు సంరక్షకుడు, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డీన్ యాద్వేంద్రదేవ్ ఝాలా మాట్లాడుతూ.. “స్వతంత్ర భారతదేశంలో మనం కోల్పోయిన ఏకైక పెద్ద జంతువు ఇదే”నన్నారు. ” చిరుతను తిరిగి ఇండియాకు తీసుకువస్తే, కేంద్రం ప్రభుత్వం వాటి పునరావాసం మరియు వాటి మనుగడకు కావాల్సిన నిధులు వెచ్చిస్తుంది మరియు అన్ని జీవవైవిధ్యాలు వృద్ధి చెందుతాయి” అని చెబుతూ మరో విషయం కూడా తెలిపారు. ఇప్పుడు నమీబియా నుంచి తీసుకొస్తున్న ఆ చిరుతలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడడం కాస్త కష్టమేనన్నారు. వాటికి సరైన ఆహారం అందిచడంతోపాటు, వాటి మనుగుడకు అవసరమైన సౌకర్యాలు కలిగించడం జూ పార్క్‌లలో కష్టంతో కూడుకున్న పని అని అన్నారు.