inspiring story of beauty queen Naaz Joshi
mictv telugu

స్ఫూర్తిదాయకమైన అందాల రాణి కథ!

January 4, 2023


నాజ్ జోషి 2021-22 ఎంప్రెస్ ఎర్త్ టైటిల్ను గెలుచుకుంది. నాజ్ జోషి కథ నిజంగా స్ఫూర్తిదాయకం. ఒక వ్యక్తి పరిపూర్ణ కృషి ద్వారా విజయం ఎలా సాధించవచ్చో ఈమె కథను ఉదాహరణగా చెప్పవచ్చు.
విజయం సాధించే ప్రయాణం ఎప్పుడూ సులభం కాదు. నాజ్ జోషి పదేళ్ల వయసులో సామూహిక అత్యాచారానికి గురరైంది. అంతేకాదు వీధుల్లో అడుక్కుంటూ బతికింది. ఇప్పుడామె భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ అంతర్జాతీయ అందాల రాణిగా మారింది.
నాజ్ ఢిల్లీలో జన్మించింది. చూడడానికి అబ్బాయిలా కనిపించేవాడు కానీ హావభావాలు, వ్యవహారశైలి అమ్మాయిలా ఉండేది. నాజ్ ట్రాన్స్ జెండర్ అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను మామకు అప్పగించారు. 10 సంవత్సరాల వయసు ఉన్న నాజ్ ని ఆమె మామ, ఇంకా అతని స్నేహితులు కొందరు ఆమె పై సామూహిక అత్యాచారం చేశారు. దాంతో ఆసుపత్రిలో చేరింది. అక్కడే ఒక ట్రాన్స్ జెండర్ ఆమెను రక్షించి తీసుకెళ్లింది.

ఫ్యాషన్ డిజైనింగ్..

లింగమార్పిడి జరిగిన తర్వాత నాజ్ బార్స్, మసాజ్ పార్లర్లలో పని చేసింది. బతుకుదెరువు కోసం వీధుల్లో అడుక్కొని జీవనం సాగించింది. అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును కొనసాగించింది. ఫ్యాషన్ డిజైనింగ్ లో కోర్సు పూర్తి చేసి విజయం సాధించింది. నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పట్టుభద్రురాలయింది. ఆ తర్వాత 2013లో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుంది. అప్పుడు తన మోడలింగ్ వృత్తిని మొదలుపెట్టింది. నాజ్ ఒక లింగమార్పిడి సెక్స్ వర్కర్ ఫోటోను చిత్రీకరించాలనుకున్న ఫోటోగ్రాఫర్ తో పరిచయం ఏర్పడింది. నాజ్ అలా ఒక మ్యాగజైన్ కవర్ పై కనిపించింది.

అందాల పోటీల్లో..

ఆ ఫొటోషూట్ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఇక కెరీర్ గురించి వెనుదిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. నాజ్ మిస్ వరల్డ్ డైవర్సిటీ బ్యూటీ పేజెంట్ టైటిల్ ను వరుసగా 3 సార్లు గెలుచుకుంది. ఇది మాత్రమే కాదు.. 8 అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకొని.. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ అంతర్జాతీయ అందాల రాణిగా పేరు సంపాదించింది.

ఇవి కూడా చదవండి :

ముగ్గురు భార్యలతో 5 క్రికెట్ టీంలు రెడీ చేసిన పాకిస్తానీ

వరుడు ఇచ్చిన బహుమతికి వధువు షాక్!

ప్రపంచాన్ని భయపెట్టిన గొయ్యి

కాళేశ్వరానికి డీపీఆరే లేదు.. ఎన్ని సార్లు డిజైన్ మార్చిర్రు..ఎవరికోసం మార్చిర్రు.. అన్ని తెలుసు మాకు