Insta new feature..Action and reaction at the same time
mictv telugu

ఇన్‌స్టా కొత్త ఫీచర్..ఒకేసారి యాక్షన్, రియాక్షన్

July 26, 2022

ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం వినియోగదారులకు మరో శుభవార్తను చెప్పింది. ఇన్‌స్టా రీల్స్‌కు సంబంధించి మరో రెండు కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొంది. ఇటీవలే ఇన్‌స్టా పరిచయం చేసిన ఫీచర్‌లో.. ఇన్‌స్టాగ్రామ్‌లో 15 నిమిషాలతో కూడిన ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే, అది ఆటోమేటిగ్గా రీల్స్‌గా మారిపోతున్న విషయం తెలిసిందే.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ డ్యూయల్ పేరుతో తీసుకొస్తున్న రెండు ఫీచర్స్‌తో ఒకేసారి రెండు రకాల వీడియోలను రికార్డ్ చేయొచ్చని తెలిపింది. ఉదాహరణకు..”మీ స్నేహితులు చేస్తున్న రీల్సను ఫోన్ వెనుక కెమెరాతో రికార్డు చేస్తున్నారు కదా. అలా వీడియో తీస్తూనే సెల్ఫీ కెమెరాతో దానికి మీ స్పందనను రికార్డు చేయొచ్చు. అంటే మీ స్నేహితుల రీల్స్, దానికి మీ స్పందన ఒకేసారి స్క్రీన్‌పై కనిపిస్తాయి. వెనుకవైపు కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో పెద్ద స్క్రీన్‌లో, సెల్ఫీ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో చిన్న స్క్రీన్‌లో కనిపిస్తుంది” అని తెలిపింది.

ఎలా ఈ డ్యూయల్ ఫీచర్‌ను ఉపయోగించాలో యాజమాన్యం స్పష్టంగా తెలియజేసింది.”ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు పైన ఉన్న ప్లస్ సింబల్‌పై క్లిక్ చేస్తే రీల్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే రీల్స్ రికార్డ్ చేసేందుకు కెమెరా ఆప్షన్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ మీద ఎడమవైపు కనిపిస్తున్న ఆప్షన్లలో డ్యూయల్ అనే లేబుల్‌తో ఉన్న కెమెరా ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీ వీడియో రికార్డ్ అవుతుంది. వీడియో రికార్డింగ్ మొత్తం పూర్తయ్యాక ఎప్పటిలానే దానికి ఎఫెక్ట్స్, మ్యూజిక్ వంటివి యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.” అని పేర్కొంది.

మరోపక్క ఇన్‌స్టాగ్రామ్ డ్యూయల్‌తోపాటు మరో ఫీచర్‌ను కూడా యూజర్లకు పరిచయం చేయనుంది. ఇతరులు చేసిన రీల్స్ మీకు నచ్చితే.. వాటిని అనుకరించి అలాంటివే చేసేందుకు వీలుగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ టెంప్లెట్స్ ఫీచర్ ను తీసుకొస్తోంది. ఇతరులు క్రియేట్ చేసిన రీల్ చూస్తున్నప్పుడు, అది మీకు నచ్చింది. అలాంటిదే చేసేందుకు సదరు రీల్ చూస్తూ స్క్రీన్ మీద కనిపించే కెమెరా సింబల్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు నచ్చిన రీలకు ఉన్న మ్యూజిక్, ఎఫెక్ట్స్ తో ఫొటో/వీడియో యాడ్ చేసి అప్లోడ్ చేస్తే చాలు. రీలను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చడం కోసం ఈ ఫీచర్‌ను పరిచయం చేసినట్లు ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.