Instagram Down: Some Instagram Users Report Followers Had Dropped Significantly
mictv telugu

యూజర్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్.. అకౌంట్ సస్పెండ్ అంటూ మెసేజ్‌లు

November 1, 2022

 

సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌.. ప్రపంచవ్యాప్తంగా నిన్న తన వినియోగదారులను ఇబ్బంది పెట్టింది. లాగిన్ అయ్యే సమయంలో అకౌంట్ సస్పెండ్ అయిందంటూ మెసేజ్‌లు రావడంతో వేలాది మంది యూజర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. లాగిన్ టైమ్‌లో ‘మీ ఖాతా సస్పెండ్ అయిందంటూ’ వారికి సందేశం కనిపించింది. యూజర్లు దీన్ని ఇన్‌స్టాగ్రామ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదంతా నిన్న(సోమవారం) సాయంత్రం జరిగింది. దీనిపై ఇన్‌స్టాగ్రామ్ స్పందిస్తూ.. ‘‘మీలో కొందరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను యాక్సెస్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మా దృష్టికి వచ్చింది. మేము దీన్ని సరిచేసే పనిలో ఉన్నాం. జరిగిన అసౌకర్యానికి మన్నించండి’’ అని ఇన్‌స్టాగ్రామ్‌ ట్విట్టర్‌లో ప్రకటించింది.

https://www.sakshi.com/telugu-news/movies/producer-dil-raju-son-pic-goes-viral-social-media-1498241

ఆలస్యం అయినా ఈ సమస్య ఎక్కడ ఉందో గుర్తించి ఇన్‌స్టాగ్రామ్‌ గుర్తించి సరిచేసింది. ‘‘ఈ బగ్ ను పరిష్కరించాం. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తమ ఖాతాల విషయంలో సమస్యలు ఎదుర్కోవడానికి కారణం ఇదే. అకౌంట్ హోల్డర్ల ఫాలోవర్లలోనూ ఇది మార్పులు చేసింది. మన్నించండి’’ అని ఇన్‌స్టాగ్రామ్ పేర్కొంది. వాట్సాప్ గత నెల 25న ప్రపంచ వ్యాప్తంగా కొన్ని గంటల పాటు నిలిచిపోవడం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ తోపాటు, ఫేస్ బుక్ మెటాకు సంబంధించినవి కావడం గమనార్హం.