Instagram Suspends Singer Chinmayi Sripada's Account
mictv telugu

చిన్మయి అకౌంట్‌కు న్యూడ్ ఫోటోలు.. జన్మనిచ్చిన మర్నాడే వేధింపులు

June 24, 2022

Instagram Suspends Singer Chinmayi Sripada's Account

కవలలకు జన్మినిచ్చిన మరుసటి రోజే సింగర్‌ చిన్మయికి ఇన్‌స్టాగ్రామ్‌ షాకిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ పాలసీలకు విరుద్ధంగా తన పోస్టులు ఉన్నాయనే రిపోర్డ్స్‌ అందడంతో ఇన్‌స్టాగ్రామ్‌ తన అకౌంట్‌ను రద్దు చేసింది. ఈ విషయాన్ని చిన్మయి స్వయంగా వెల్లడించింది. కవలలకు జన్మినిచ్చిన విషయాన్ని ఇన్‌స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేయగానే.. కొంద‌రు వ్య‌క్తులు (పురుషులు) అదే పనిగా తనపై అభ్యంతరకర కామెంట్స్ చేసినట్లు చెప్పింది. అంతేకాకుండా వారికి సంబంధించిన అభ్యంత‌రకర ఫొటోలు తనకు అకౌంట్ కు పంపించారని తెలిపింది.

ఇదే విషయమై ఇన్‌స్టాగ్రామ్‌ ఆమె అకౌంట్‌ను రద్దు చేసినట్లు చిన్మయి చెప్పింది. తన బ్యాకప్‌ అకౌంట్‌(కొత్త ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌), ట్విటర్‌ ద్వారా ఆమె ఈ విషయాన్ని తెలిపింది. ఈ మేరకు చిన్మయి పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. ‘నా ఇన్‌స్టా అకౌంట్‌ను డిలిట్‌ చేశారు. ‘నా అకౌంట్‌లో న్యూడ్‌ ఫొటో పోస్ట్‌ చేసి.. పైగా నాపై రిపోర్ట్‌ చేశారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌ నా అకౌంట్‌ను రద్దు చేసింది’ అని తెలిపింది.
చిన్మ‌యి సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉంటుంద‌ని తెలిసిందే. ప్ర‌త్యేకించి #MeToo movementతో త‌మిళ ఇండ‌స్ట్రీలో స్త్రీలను దోపిడికి గురిచేసే..బాలికల ప‌ట్ల‌ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డే ప‌లువురు పెద్ద‌ల పేర్లు తెర‌పైకి తీసుకొచ్చి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.