నా త‌ల్లిని అవ‌మానిస్తారా..? - MicTv.in - Telugu News
mictv telugu

నా త‌ల్లిని అవ‌మానిస్తారా..?

December 22, 2021

04

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతకొన్ని నెలలుగా ఇటు అధికార పార్టీ మంత్రులకు, అటు ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. ఈ సందర్బంగా గత నెలలో ఏపీ అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరిని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానించారని మీడియా ముందు బాబు వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి తెలుగు రాష్ట్రాలలో ఎంత వైరల్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సంఘటనపై నందమూరి కుటుంబ సభ్యులు సైతం స్పందించారు.

అయితే, రెండు రోజుల క్రితం నారా భువనేశ్వరి తిరుపతిలో వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరుపున ఆర్థిక సహాయంగా రూ. లక్ష చెక్కులను అందజేశారు. అనంతరం ఆమె మీడియతో మాట్లాడిన మాటలపై అధికార పార్టీ మంత్రులు కొడాలి నాని, ఎమ్మెల్యే రోజా పలు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ మండిప‌డ్డారు. బుధవారం నారా లోకేశ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకుంటే దీనిపై కూడా ఆరోప‌ణ‌లు చేస్తారా? నా త‌ల్లిని అవ‌మానిస్తారా? మా తండ్రి మాదిరిగా నేను మెత‌క వైఖ‌రిని అవ‌లంబించ‌ను. నా త‌ల్లిపై ఆరోప‌ణ‌లు చేసిన వారిని నేను త‌గి బుద్ధి చెబుతాను’ అని నారా వ్యాఖ్యానించారు. ‘వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవడానికి మీరు ఏం చేశారు..? మీరా నా త‌ల్లిపై ఆరోప‌ణ‌లు చేసేది..? ఒళ్లు ద‌గ్గర‌పెట్టుకోండి. నేను చెబుతున్నా.. మీరు ఎక్క‌డ ఉన్నా నేను వ‌ద‌లి పెట్ట‌ను, నా తండ్రి వ‌దిలి పెడ‌తారేమో గాని, నేను మాత్రం వ‌ద‌లిపెట్ట‌ను అని హెచ్చరించారు.