కరోనాతో చనిపోయినా జీవిత బీమా చెల్లించాల్సిందే..  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాతో చనిపోయినా జీవిత బీమా చెల్లించాల్సిందే.. 

April 6, 2020

Insurance companies will not decline Covid-19 death claims

కరోనాతో అల్లకల్లోలం అవుతున్న పాలసీదార్లపై బీమా మండలి దయచూపింది. ఈ మేరకు జీవిత బీమా మండలి, బీమా సంస్థలకు మఖ్యమైన సూచనలు చేసింది. కొవిడ్‌-19తో చనిపోయిన వారి క్లైమ్స్‌ను అత్యంత వేగంగా పరిష్కరించాలని సోమవారం స్పష్టం చేసింది. పరిష్కార ప్రక్రియను వేగంగా చేపట్టాలని .. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సూచనలు జారీచేసింది. అలాగే కొవిడ్‌-19 డెత్‌ క్లైమ్స్‌కు ‘ఫోర్స్‌ మెజర్‌’ (Force Majerue) నిబంధన వర్తించదని తెలిపింది. ముందుగా తెలియని, నియంత్రించలేని పరిస్థితులకు ‘ఫోర్స్‌ మెజర్‌’ను అమలు చేస్తారు. కరోనాకు దీనిని వర్తింపజేయడం లేదని జీవిత బీమా మండలి స్పష్టంచేసింది. అయితే దీని గురించి తెలుసుకోవాలని వినియోగదారులు బీమా సంస్థల చుట్టూ తిరుగుతున్నారని చెప్పింది. ఈ నిబంధనపై వివాదాలు, వదంతులకు తావులేకుండా.. తమ వినియోగదారులకు వ్యక్తిగతంగా తెలపాలని బీమా సంస్థలకు మండలి ఆదేశించింది. 

ఈషయమై జీవిత బీమా మండలి సెక్రెటరీ జనరల్‌ ఎస్‌ఎన్‌ భట్టాచార్య మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కొవిడ్‌-19 మహమ్మారి ఇంట్లో ప్రతి ఒక్కరికి జీవిత బీమా ప్రాథమిక అవసరం అని చెబుతోంది. ‌‌లాక్‌డౌన్‌తో వినియోగదారులకు కలిగిన అంతరాయాన్ని తగ్గించేందుకు జీవిత బీమా రంగం అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఈ సంక్లిష్ట సమయంలో కొవిడ్‌-19 డెత్‌ క్లైమ్స్‌ సహా ఎన్నో సేవలను డిజిటల్‌ రూపంలో అందజేస్తున్నాం’ అని భట్టాచార్య తెలిపారు. కాగా, ఏప్రిల్‌ నెలలో జీవిత బీమా పాలసీల ప్రీమియం చెల్లించే వినియోగదారులకు మరో 30 రోజులు అదనపు సమయం ఇస్తున్నాం అని ఐఆర్‌డీఏఐ ప్రకటించిన విషయం తెలిసిందే.