హోంగార్డులకు మరో శుభవార్త.. ఇకపై బీమా సదుపాయం..  - MicTv.in - Telugu News
mictv telugu

హోంగార్డులకు మరో శుభవార్త.. ఇకపై బీమా సదుపాయం.. 

October 21, 2019

home guards .

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇటీవలే రాష్ట్రంలోని హోంగార్డుల వేతనం రూ. 18 వేల నుంచి రూ. 21,300కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా హోంగార్డులను కూడా ఆరోగ్య భద్రతలో భాగం చేస్తూ బీమా సదుపాయం కల్పించింది. 

విధి నిర్వహణ సమయంలో, ప్రమాదవశాత్తు మరణించిన హోంగార్డులకు రూ.40 లక్షలు, అంగవైకల్యం కలిగితే రూ.30 లక్షలు బీమా రూపంలో అందించనున్నారు. అయితే ఈ బీమా సౌకర్యం పోలీసులకు కూడా వర్తిస్తుంది. ఈ బీమా ద్వారా 15 వేల మంది హోంగార్డులు, 72 వేల మంది పోలీసులు ఆరోగ్య భద్రత పరిధిలోకి రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, యాక్సిస్ బ్యాంకు ప్రతినిధి రామకృష్ణ సమక్షంలో పోలీస్ శాఖ, యాక్సిస్ బ్యాంకు మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది.