Insurance scheme for handloom workers : KTR
mictv telugu

నేతన్నలకు కేటీఆర్ గుడ్ న్యూస్.. ఆగస్ట్ 7న బీమా పథకం ప్రారంభం

August 1, 2022

తెలంగాణలోని చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. రైతు బీమా తరహాలో నేతన్న బీమా పథకాన్ని తీసుకొస్తున్నట్టు సోమవారం వెల్లడించారు. దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 80 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని 60 ఏళ్లలోపు వయసున్న వారు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. ఏ కారణం చేతనైనా నేతన్నలు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుందని, దీంతో ఆర్ధిక అవసరాలు తీర్చుకోవచ్చన్నారు. ఈ పథకాన్ని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇలాంటి పథకం దేశంలోనే మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని ట్విట్టర్ ద్వారా వివరించారు.