ఫిలిప్పీన్స్‌లో దారుణం జరిగింది. శనివారం దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇందులో సెంట్రల్ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్ గవర్నర్ (రోయెల్ డగామో) సహా మరో ఎనిమిది మంది వ్యక్తులు మరణించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని ఇవాళ పోలీసులు మట్టుబెట్టారు. మరో ముగ్గురిని అరెస్టు చేశారని అధికారులు తెలిపారు. కనీసం ఆరుగురు వ్యక్తులు, అసాల్ట్ రైఫిల్స్‌తో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి కాల్పులకు తెగబడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని తన ఇంటిలో ప్రావిన్షియల్ లీడర్ గ్రామస్థులతో సమావేశమైనప్పుడు ముష్కరులు కాల్పులు జరిపారు.నిందితులు 8 మంది గ్రామస్తులపై కూడా కాల్పులు జరిపారు.డెగామో హత్యను అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ తీవ్రంగా ఖండించారు. గత ఏడాది అధ్యక్ష ఎన్నికల సమయంలో డెగామాన్‌లు ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో రాష్ట్రపతి “ఈ క్రూరమైన, దారుణమైన నేరానికి పాల్పడిన నిందితులను చట్టం ముందుకి తీసుకువచ్చే వరకు తమ ప్రభుత్వం విశ్రమించదు” అని అన్నారు.అదే సమయంలో, సాయుధ దుండగులు పాంప్లోనా నగరంలోని అతని నివాస సముదాయంలోకి ప్రవేశించి కాల్పులు జరిపారు.
Miscreants kill 8 including governor in Philippines, one killed in encounter; Three arrests https://t.co/tnUUrArD4p
— DEE NEWS (@DEENEWS_IN) March 5, 2023