టీం ఇండియా - సౌతాఫ్రికా ఆటగాళ్లకు ఉగ్రముప్పు - MicTv.in - Telugu News
mictv telugu

టీం ఇండియా – సౌతాఫ్రికా ఆటగాళ్లకు ఉగ్రముప్పు

October 6, 2019

Intelligence Alert To Visakha Police

విశాఖపట్నంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. సాగరతీరం నుంచి వచ్చి ముష్కరులు దాడి చేసే అవకాశం ఉందని అలర్ట్ చేశారు. వైజాగ్‌లో టీం ఇండియా – సౌతాఫ్రికా మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఐబీ హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. స్టేడియంతో పాటు రద్దీ ఏరియాలు, తీర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. 

మ్యాచ్ సందర్భంగా విశాఖ స్టేడియంలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. కోస్ట్‌గార్డ్‌, నేవీలతో మెరైన్‌ పోలీసులు పర్యవేక్షణ చేపట్టారు. ఆదివారం ఇక్కడ చివరి రోజు జరుగనుంది. ఆటగాళ్లకు కూడా భద్రత పెంచారు. వారు ఉంటున్న హోటల్ వద్ద కూడా పోలీసులు మోహరించారు. స్టేడియంలోకి వచ్చి వెళ్లేవారి కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు.