తమిళనాడుపై ముష్కరుల గురి.. శ్రీలంక నుంచి ఆరుగురు.. - MicTv.in - Telugu News
mictv telugu

తమిళనాడుపై ముష్కరుల గురి.. శ్రీలంక నుంచి ఆరుగురు..

August 23, 2019

Intelligence Bureau Alert to Tamilnad Police..

భారత్‌ను ఉగ్రవాద సంస్థలు టార్గెట్‌గా చేసుకున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి ముష్కర మూకలు దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిఘా వర్గాలకు అందిన సమాచారం ప్రకారం తమిళనాడు రాష్ట్రాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడే అవకాశం ఉందని చెబుతున్నారు. శ్రీలంక నుంచి ఆరుగురు చొరబడినట్టు ఐబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ముఠా సభ్యులు శ్రీలంక  మీదుగా వచ్చి కొయంబత్తూర్‌లో తలదాచుకున్నట్టుగా సమాచారం. వీరిలో ఒకరు పాకిస్థానీ కాగా.. ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లింలుగా తెలుస్తోంది. ప్రముఖులు ఇళ్లు, రద్దీ ప్రదేశాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో భద్రతను కట్టుదిట్టం చేసి హై అలర్ట్‌ ప్రకటించారు. నగరంలోని అన్ని వాహనాలను తనిఖీలు చేస్తూ.. అనుమానిత వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా సరిహద్దుల వద్ద కూడా పాక్ కవ్వింపులకు పాల్పడటం, ముష్కర మూకను పలు ప్రాంతాల్లో మోహరించినట్టు భద్రతా బలగాలు చెబుతున్నాయి.