Inter Board allowed students to join Intermediate
mictv telugu

ఇంటర్ అడ్మిషన్లకు చివరి అవకాశం.. నేటి నుంచి షురూ

November 21, 2022

తెలంగాణలో ఇంటర్మీడియట్ లో ప్రవేశానికి ఇంటర్ బోర్డు విద్యార్ధులకు చివరి అవకాశం కల్పించింది. ఈ నెల 21 నుంచి 27 వరకు అడ్మిషన్ పొందని స్టూడెంట్స్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాలు, మోడల్ పాఠశాలలు, కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో చేరవచ్చని తెలిపింది. ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్ధులు చేరేలా చూడాలని సూచించింది. ఇదే చివరి అవకాశమని, ఇక పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. వాస్తవానికి గత నెల 15వ తేదీతోనే ఇంటర్ తొలి ఏడాది అడ్మిషన్ల గడువు ముగిసింది. కానీ, కొన్ని ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీలు విద్యార్ధుల వివరాలను వెబ్ సైటులో అప్ లోడ్ చేయలేదు. దాంతో అడ్మిషన్లకు మరో అవకాశం ల్పించాలని కోరడంతో ఇంటర్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.