తెలంగాణలో రేపే ఇంటర్ ఫలితాలు విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో రేపే ఇంటర్ ఫలితాలు విడుదల

June 14, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే ముగిసిన ఇంటర్ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ అధికారులు ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. ఇంటర్ పరీక్షల ఫలితాలను రేపు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది దాదాపు 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలను రాశారని, సమాధాన పత్రాల మూల్యాంకనం 14 కేంద్రాల్లో కొనసాగిందని, అన్నీ కుదరితే రేపు ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. విద్యార్థిని, విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్‌ను ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ sbie.cgg.gov.in లో చెక్ చేసుకోని, ఇదే వెబ్‌సైట్ నుంచి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

ఇక, పదోవ తరగతి ఫలితాల విషయానికొస్తే, ఆన్సర్ షీట్స్ మూల్యాంకనం ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. టెన్త్ రిజల్ట్స్ జూన్ 25న లేదా 26న ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పదోవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత ఇంటర్ ఫస్టియర్ క్లాసులు జులై 1 నుంచి, ఇంటర్ సెకండియర్ క్లాసులు ఈ నెల 15 నుంచి ప్రారంభమౌతాయని తెలిపారు. ఇంటర్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న లక్షల మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. రేపు ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది.