అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి - MicTv.in - Telugu News
mictv telugu

అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి

September 27, 2020

busss

దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణలో ఆర్టీసీ అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి నెల చివర్లో బందైన బస్సులు ఇప్పుడిప్పుడే పూర్తిగా రోడ్లపైకి వస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ సిటీ సర్వీసులను పునరుద్ధరించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా అంతర్ రాష్ట్ర సర్వీసులను కూడా ప్రారంభించింది. సోమవారం నుంచి బెంగళూరు మినహా కర్ణాటకలోని పలు ప్రాంతాలు, మహారాష్ట్రకు బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. 

బీదర్‌, రాయచూర్‌, నాందేడ్‌, పుణే, ముంబాయ్‌, చంద్రపూర్‌, నాగ్‌పూర్‌ తదితర ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన కార్పొరేషన్లు కూడా తెలంగాణకు బస్సు సేవలను పునరుద్దరించున్నాయి. అలాగే కార్గో సేవలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కార్గోలో మరిన్ని సేవలను అందించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటి వరకు పలు ప్రాంతాల మధ్య పార్శిళ్లను చేరవేస్తుండగా, ఇప్పుడు అవసరమైన పక్షంలో ఇంటి వద్దకే వాటిని చేర్చాలని నిర్ణయించింది. బస్సు స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలకు చెందిన పార్శిళ్లను వాటి వద్దకే చేర్చాలని నిర్ణయించింది.