ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

April 12, 2022

01

ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్ధులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు ఆన్‌లైన్ విద్యాబోధనకే పరిమితం కావడంతో చాలా మంది విద్యార్ధులు చదువులో వెనుకబడ్డారు. ఈ నేపథ్యంలో ఎంసెట్‌లో ర్యాంకు కేటాయించడానికి ఇంటర్‌లో పాసయితే చాలని విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేసింది. గతంలో ఎంసెట్ ర్యాంకులు కేటాయించాలంటే జనరల్ విద్యార్థులు 45 శాతం, ఇతర కేటగిరీ విద్యార్ధులు 40 శాతం మార్కులు తెచ్చుకోవాలి. అలాగే ఈ సారి ఇంటర్ మార్కులకు వెయిటేజీ కూడా ఉండదు. అంటే కేవలం ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకును కేటాయిస్తారు.