ఈ నెల 15 నుంచి 23 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. గంట ముందే పరీక్షా హాలులోకి అనుమతిస్తామని చెప్పారు. పరీక్ష ప్రారంభమయ్యాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.78 లక్షల విద్యార్థుల కోసం 872 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటికే హాల్ టికెట్లు ఆయా కళాశాలలకు పంపించామని తెలిపారు. ఇక కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనుమతి పొందిన కళాశాలల వివరాలు త్వరలో వెబ్సైట్లో ఉంచుతామని అశోక్ చెప్పారు.