కులహత్య కేసులో ఆరుగురికి ఉరి - MicTv.in - Telugu News
mictv telugu

కులహత్య కేసులో ఆరుగురికి ఉరి

December 12, 2017

తమిళనాడులో గత ఏడాది కులాంతర వివాహంపై అక్కసుతో దళితుడిని దారుణంగా నరికి చంపిన కేసులో దోషులకు శిక్ష పడింది. మంగళవారం తిరుపూర్ సెషన్స్ కోర్టు ఆరుగురికి మరణశిక్ష వేసింది. ఒకరికి జీవితఖైదు పండి. మరొకడికి ఐదేళ్ల జైలుశిక్ష పడింది. ఒక మహిళను కోర్టు  నిర్దోషిగా వదిలేసింది. వీరిలో దళితుడు పెళ్లి చేసుకున్న యువతి తండ్రి చిన్నస్వామి కూడా ఉన్నాడు. దోషులకు జరిమానా కూడా విధించారు. తన కొడుకు చదువుకుంటున్నాడని, తనకు తేలికపాటి శిక్ష వేయాలని చిన్నస్వామి చేసిన వినతి జడ్జి అలిమేలు నటరాజన్ తోసిపుచ్చారు.
2016లో దళిత యువకుడు శంకర్, దేవర్ వర్గానికి చెందిన కౌసల్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. అమ్మాయి కుటుంబానికి ఇది నచ్చలేదు. మార్చి 13వ తేదీన ఉడుమల్‌పేట్ బస్‌స్టాండ్‌లో కొత్త జంటపై హత్యాయత్నం జరిగింది. చిన్నస్వామి ఆదేశంపై కిరాయి హంతకులు శంకర్‌ను దారుణంగా నరికి చంపారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన  కౌసల్యకు ఆస్పత్రిలో చికిత్స చేశారు.  ఈ దారుణం వీడియో తమిళనాడులో వైరల్ అయింది. పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. కులంపేరుతో హత్యలకు పాల్పడేవారికి ఈ తీర్పు గుణపాఠమని కౌసల్య చెప్పింది.