అలా చేస్తే మగపిల్లలు పుడతారట.. మతబోధకుడి వింత సలహా - MicTv.in - Telugu News
mictv telugu

అలా చేస్తే మగపిల్లలు పుడతారట.. మతబోధకుడి వింత సలహా

February 14, 2020

Ahmad Nagar.

సైన్స్ ఎంతగా దినదినాభివృద్ధి చెందుతున్నా మూఢ నమ్మకాలు ఇలాంటివాళ్లలో పూని దానిని డామినేట్ చేస్తున్నాయి. పుట్టబోయే బిడ్డ ఆడా, మగా అన్న విషయం వైద్యులు చెప్పకూడదని నిబంధన ఉంది. అలా చెప్పడం చట్టరీత్యా నేరం. అయితే ప్రముఖ మరాఠా బోధకుడు (Preacher) ఇందూరికర్ మహరాజ్ మాత్రం ఇందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అహ్మద్‌నగర్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. సరి సంఖ్య (Even) ఉన్న రోజును సెక్స్, డేటింగ్ చేస్తే… మగ పిల్లాడు పుడతాడనీ, అదే బేసి సంఖ్య (Odd) ఉన్న రోజున సెక్స్ లేదా డేటింగ్ చేస్తే ఆడ పిల్ల పుడుతుందని బల్లగుద్ది మీర చెబుతున్నారు. దీంతోపాటు ఆయన మరో మాట కూడా అన్నారు. మంచి సమయంలో సెక్స్ చేస్తే…. మంచి బిడ్డ పుడతారనీ అదే చెడు సమయంలో సెక్స్ చేస్తే.. పుట్టే బిడ్డ ఆ కుటుంబానికి చెడ్డపేరు తెస్తారని కూడా చెప్పారు. 

ఆయన చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై పెద్ద దూమారమే రేగుతోంది. ఇలాంటివి నమ్మకూడదు అంటున్నారు. మరికొందరేమో ఆయన ఎందుకు అన్నారో.. ఏం ఉద్దేశంతో అన్నారోనని వెనకేసుకు వస్తున్నారు. కాగా, ఆయన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించారు. ఈ వ్యాఖ్యలు ప్రీ-కన్సెప్షన్ అండ్ ప్రి-నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (PCPNDT) యాక్ట్‌కి వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. ఆయనపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.