సిరిసిల్లలో అప్పు చెల్లించలేదని ఇంటికి తాళం - MicTv.in - Telugu News
mictv telugu

సిరిసిల్లలో అప్పు చెల్లించలేదని ఇంటికి తాళం

May 21, 2019

Interest Merchant Locked House At Rajanna Sircilla District Yellareddy Peta Mandal Racharla Boppapur.

ఇచ్చిన బాకీ తిరిగిచెల్లించడం లేదని  అప్పు తీసుకున్న ఇంటికి తాళం వేశాడు ఓ వడ్డీ వ్యాపారి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఒడ్డె శాంతవ్వ.. 15 నెలల మహ్మద్ ముస్తాఫాకు రూ.2.10 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఇందుకు 2 శాతం వడ్డీ చెల్లించాలని సూచించింది. అయితే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ముస్తాఫా.. శాంతవ్వకు డబ్బు తిరిగి ఇవ్వలేదు.

దీంతో శాంతవ్వ తన మనుషులను పంపించి, ముస్తాఫా ఇంటికి తాళం వేయించింది. దీంతో వారంతా బిక్కుబిక్కుమంటూ ఇంటిముందు కూర్చున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తాళాన్ని తీయించారు. సమస్య పరిష్కారానికి సోమవారం పోలీస్ స్టేషన్‌లో చర్చింద్దాం అని హామీ ఇచ్చారు. సోమవారం ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు రావడంతో వారితో మాట్లాడి, వాయిదా పద్దతిలో డబ్బు ఇవ్వడానికి ఒప్పందం కుదిర్చారు. దీంతో ఎలాంటి కేసులు, గొడవలు లేకుండా సమస్యను పరిష్కరించిన ఎస్సై ప్రవీణ్ కుమార్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.