పుట్టబోయే బిడ్డ కడుపులో ఉండగానే అదృష్టం , రాంచరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..! - Telugu News - Mic tv
mictv telugu

పుట్టబోయే బిడ్డ కడుపులో ఉండగానే అదృష్టం , రాంచరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

March 13, 2023

RRR మూవీ ఆస్కార్ అవార్డు దక్కించుకోవడంతో అభిమానులంతా సంబురాల్లో ఉన్నారు. ఎస్ఎస్ రాజమౌళి విజన్ను ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కింది. ఈ మూవీ టీంలో సంతోషంలో ఉన్నారు. కాగా రాంచరణ్ తేజ బ్లాక్ సూట్ లో ఆస్కార్ ఫంక్షన్ హాజరయ్యారు. ఆయన సతీమణి ఉపాసన సంప్రదాయ చీరకట్టులో అందర్నీ ఆకట్టుకుంది. త్రిబుల్ ఆర్ ఆస్కార్ గెలిచిన తర్వాత రాంచరణ్, ఉపాసన మీడియాతో మాట్లాడారు. త్రిబుల్ ఆర్ ఫ్యామిలీలో భాగంగానే నేను వచ్చాను అంటూ ఉపాసన చెబుతుండగా రాంచరణ్ అందుకు తాను ఆరు నెలల గర్భవతి. పుట్టబోయే బిడ్డకు ఇప్పుడే ప్రేమ లభిస్తోంది. కడుపులో ఉండగానే ఆ బిడ్డ మాకు అదృష్టాన్ని తెచ్చిపెడుతోందంటూ వ్యాఖ్యానించారు రామ్ చరణ్.