ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ హవానే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా సాధించిన రికార్డుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా బడ్జెట్ గురించి కొందరు చర్చించుకుంటున్నారు. దాదాపు 500 కోట్ల పైచిలుకు డబ్బులతో ఈ చిత్రం నిర్మితమైంది. దీంతో కొందరు ఈ డబ్బులతో ఏమేం చేయవచ్చో తమ ప్రతిపాదనలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. కొందరైతే ఏపీ బడ్జెట్లో ఏయే పథకాలకు ఈ నిధులు సరిపోతాయో పోల్చుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాల పేరిట వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో కొన్ని పథకాలకు చిత్ర బడ్జెట్ సరిపోతుందని విశ్లేషిస్తున్నారు. వాటిలో.. వైఎస్సార్ ఈబీసీ పథకం, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, కాపు నేస్తం వంటి పథకాలను ఒక ఏడాది అమలు చేయవచ్చు అనే చర్చ సాగుతోంది.