పరువు హత్య కేసులో ట్విస్ట్.. వాళ్లంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ - MicTv.in - Telugu News
mictv telugu

పరువు హత్య కేసులో ట్విస్ట్.. వాళ్లంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్

September 28, 2020

mmm,h

హైదరాబాదులో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హేమంత్, అవంతి ప్రేమ వివాహాని కంటే ముందే ఆ రెండు కుటుంబాలు ఒకరికి ఒకరు పరిచయమేనని తేలింది. వీళ్లిద్దరి తల్లులు స్నేహితురాళ్లేనని పోలీసులు తేల్చారు. ఆ పరిచయం కారణంగా ప్రేమ చిగురించి పెళ్లి వరకు వెళ్లిందని అన్నారు. 

అవంతి తల్లి అర్చన,హేమంత్ తల్లి రాణి చాలా కాలంగా సన్నిహితంగా ఉండేవారు.  ఎవరి ఇంట్లో శుకార్యం జరిగినా వచ్చి వెళ్తూ ఉండేవారు. ఈ క్రమంలో రాణి బ్యూటిషన్ కూడా కావడంతో అప్పుడప్పుడు అవంతికి మేకప్ కూడా చేసేది. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. హేమంత్ కూడా పరిచయం కావడంతో వీరి మధ్య ప్రేమకు దారి తీసింది. చాలా ఏళ్ల తర్వాత వీరి వ్యవహారం బయటకు రావడంతో అవంతి కుటుంబం ఒప్పుకోలేదు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య స్నేహం చెడిపోయింది. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడంతో జీర్ణించుకోలేక హేమంత్ ను చంపేశారని పోలీసులు వెల్లడించారు.