ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్

May 5, 2022

ఐపీఎల్‌ 15వ సీజన్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానుల అంచనాలను తారుమారు చేస్తూ, రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక్కొక్క జట్టు పది మ్యాచ్‌లను ఆడాయి. అందులో కొన్ని జట్లు ఫ్లే ఆఫ్స్‌కు చేరగా, మరికొన్ని జట్లు ఫ్లే ఆఫ్స్ నుంచి వైదొలుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆర్‌సీబీ, సీఎస్‌కే జట్ల మధ్య మ్యాచ్‌ ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా జరిగింది. ఉత్కంఠ పోరులో సీఎస్‌కేపై ఆర్‌సీబీ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

 

ఓ వైపు మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంటే, మరోవైపు ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే లైవ్‌‌లో ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు లవ్‌ ప్రపోజ్‌ చేసింది. ఆ యువకుడు వెంటనే అంగీకారం తెలపడంతో అతని చేతికి రింగ్‌ను తొడిగి, అతనిని కౌగిలించుకుంది. కొద్దిసేపు వారిద్దరూ సంతోషంలో మునిగిపోయారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వీడియోను వీక్షిస్తున్న నెటిజన్లు..’లవ్‌ ప్రపోజల్‌‌లు ఐపీఎల్‌లో కొత్తేం కాదు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా జరిగాయి. ఒకసారి లైవ్‌ మ్యాచ్‌ జరుగుతుండగానే, ఓ జంట ముద్దుల్లో మునిగిపోయరు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ‘లక్కీ బాయ్‌’ అంటూ యువకుడిని పొగొడుతున్నారు.