ఆ ఊళ్ళో మొత్తం అన్నీ ఉన్నాయి. ఇళ్ళూ, చర్చిలు, షాపులు, సెలూన్లు, ఎంటర్టైన్మెంట్ హబ్ లూ అన్నీ…. కానీ అన్నీ ఖాళీగా ఉంటాయి. పాడుబడి పోయి ఉంటాయి. భూతద్దం పెట్టి వెతికినా మనుషులు కనిపించరు. బోలెడు వెహికల్స్ కూడా కనిపిస్తాయి. అవి కూడా తప్పుట్టి పోయే ఉంటాయి. ఇందులో పెద్ద వింతేముంది అనుకుంటున్నారా….వింతే ఉంది. మొత్తం ఊరంతా ఇలా ఉండడం చాలా అరుదు. ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. ఇదొక దెయ్యాల ఊరు. ఇక్కడ ఆత్మలు, ప్రాత్మలు మనుషుల్లా తిరుగుతుంటాయి. ఛ…సోది చెబుతున్నారు అనుకుంటున్నారా… అయ్యో నిజంగానే అండీ. చాలా మంది వాటిని చూశారంట కూడా.
అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో ఉందీ ఊరు. బోడీ దీని పేరు. చాలా చిన్న సిటీ. 70 ఏళ్ళ కిందట వరకు ఇది కూడా అన్ని ఊళ్ళల్లానే ఉండేది. మనుషులు కూడా ఉండేవారు ఇక్కడ. ఒకప్పుడు పదివేలకు పైగా జనాభా ఉండేదిట ఇక్కడ. ఈ ఊరికి దగ్గరలోనే బంగారు గని ఉండేది. ఈ ఊళ్ళోవాళ్ళు అక్కడే పనిచేసేవారు.అయితే ఇప్పుడు ఈ ఊరు, ఆ గని కూడా ఖాళీ అయిపోయాయి.
అంతా మంచిగా సాగుతున్న బోడీ ఊర్లోకి దెయ్యాల బయం వచ్చింది. అది బలంగా స్థిరపడిపోయింది. దాంతో నెమ్మదిగా ఊరు ఖాళీ అవడం మొదలయింది. 70 క్రితం మొత్తం సిటీ అంతా అలా ఖాళీ అయిపోయింది. తర్వాత కూడా ఇక్కడికి ఎవ్వరూ రావడానికి ఇష్టపడలేదు. దాంతో 1962లో కాలిఫోర్నియా ప్రభుత్వం దీనిని బోడీ స్టేట్ హిస్లారిక్ పార్క్ గా మార్చేసింది. ఇక్కడ టూరిస్టులను కూడా అలోవ్ చేస్తోంది.
గుండె ధైర్యం బాగా ఉన్న పర్యాటకులు అప్పుడప్పుడూ ఇక్కడకు వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారు కూడా ఇక్కడ దయ్యాలు, ప్రేతాత్యలను చూశామని చెబుతుంటారు. కొన్ని ఇళ్ళల్లో నుంచి పిల్లలు ఆడుకుంటున్న చప్పుళ్ళు విన్నామని కథలుగా చెప్పకుంటారు కూడా. బోడీ ఊర్ుని ఉన్నది ఉన్నట్టుగా వదిలేసారు కాబట్టి ఇప్పటికీ ఇక్కడ కొన్ని ఇళ్ళల్లో దుమ్ముపట్టేసిన, పాడైపోయిన ఫర్నిచర్, మిగతా వస్తువులు కనిపిస్తాయి. ఇక్కడకు కేవలం పగటి పూట మాత్రమే అనుమతిస్తారు. కాలాలను బట్టి అనుమతి టైమింగ్స్ కూడా మారుతుంటాయి. ఏది ఏమైనా 21వ సెంచురీలో కూడా దెయ్యాలు, ఆత్యలను నమ్మడం. దాని కోసం ఏకంగా ఒక ఊరినే వదిలేయడం విచిత్రమైన విషయమే.