interesting wedding rituals world wide
mictv telugu

పెళ్ళికి ముందే ముసలావిడతో శృంగారం

January 17, 2023

interesting wedding rituals world wide

కొన్ని విషయాలు భలే వింతగా ఉంటాయి. వాటిని ఊహించడానికి కూడా మనకు థాట్ రాదు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, దాని ముందు…ప్రపంచంలో వింత వింత పద్ధతులు ఉన్నాయి. మనం వాటిని ఎప్పుడూ కనీ వినీ ఎరగము కూడా ఎరగము. అలాంటి వాటిని కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.

స్వయంవరం:

దీని గురించి మనం చాలా కథలు విని ఉన్నాం. పురాణాలు, రాజుల కాలంలో ఈ పద్ధతి ఉండేదని మనకందరికీ తెలుసు. రాజకుమారి తనకు నచ్చిన రాజకుమారుడిని పెళ్ళి చేసుకునేందుకు స్వయంగా రాజులు ఏర్పాటు చేసేవారు దీన్ని. రాజకుమారి తనకు నచ్చిన వాడి మెడలో దండ వేస్తే, అతన్నే ఇచ్చి పెళ్ళి చేసేవారు. టూకీగా స్వయంవరం ఇది. ఇందులో మళ్ళీ రకరకాలు ఉండేవి. తర్వాత తర్వాత ఆ పద్ధతి పోయింది. అయితే మన దగ్గర కాదు కానీ ఆస్ట్రియాలో ఇంచుమించుగా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారుట. ఆస్ట్రియా లో ఒక గ్రామంలో యంగ్ ఉమెన్స్ ఈ పద్ధతిని అనుసరిస్తారు. ఇక్కడ వాళ్ళు ఒక ట్రెడిషనల్ డాన్స్ వేస్తారు. అలా వేస్తున్నప్పుడు చంకలో ఆపిల్ ముక్కల్ని పెడతారు. డాన్స్ పూర్తయ్యేటప్పటికి అక్కడ ఉండే పురుషుల వద్దకి మహిళ వెళ్ళి ఆపిల్ ముక్కని వాళ్ళకి ఇస్తారు. అలా ెవరికి ఇస్తారో వాళ్ళనే పెళ్ళి చేసుకుంటారుట. అదీ ఈ ఆపిల్ ముక్కల పెళ్ళి.

నేపాల్ ట్రైబ్స్‌లో సోదరులు భార్యని షేర్ చేసుకోవడం:

మన మహా భారతం లో ద్రౌపదికి అయిదుగురు భర్తలు. ఐదుగురు అన్నదమ్ముల కి ఆమె ఒకతే భార్య. ఇదే పద్ధతిని కాస్త అటు ఇటుగా నేపాల్ లో కూడా అనుసరిస్తున్నారు. నేపాల్ లో ఒక గిరిజన ప్రాంతంలో సోదరులందరికీ కూడా ఒకే భార్య ఉంటుంది. అందుకే అక్కడ ఎక్కువ మంది పిల్లలు కూడా ఉండరు.

వయసు మళ్ళిన ఆమెతో శృంగారం:

సౌత్ సుడాన్ లోని మంగయ అనే ఒక ప్రాంతం లో వయసు మళ్ళిన ఆమెతో అబ్బాయిలు శృంగారం చేస్తారు. పెళ్ళికి ముందు శృంగారంలో ట్రిక్స్ నేర్పించడం కోసం ఈ పద్ధతిని పాటిస్తారుట. స్వయంగా తల్లిదండ్రులే దీన్ని జరిపిస్తారుట పైగా. పెళ్ళి తర్వాత దంపతులు సుఖంగా ఉండడానికే ఇదంతా అని అక్కడ వాళ్ళు నమ్ముతారు.

పురుషులతో పురుషులు శృంగారంలో పాల్గొనడం:

పురాతన గ్రీస్ సాంప్రదాయం ప్రకారం వయసులో ఉన్న అబ్బాయిలు పురుషులతో శృంగారం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వయసు ఎక్కువైన పురుషులు 15, 19 ఏళ్ళ అబ్బాయిల తో పాటు శృంగారం చేస్తారు. అయితే ఈ రిలేషన్ షిప్ లో పిల్లలు పుట్టరు కాబట్టి తర్వాత అమ్మాయిలను పెళ్ళి చేసుకుంటారుట. ఏంటో వింత పద్ధతులు.

వయసులో ఉన్న అమ్మాయిలు లవ్ కుటీరంలో :

ఇక్కడ వయసులో ఉన్న అమ్మాయిలు ఈ కమ్యూనిటీలో ఒక లవ్ హర్ట్ నిర్మించుకుంటారు. చత్తీస్‌ఘడ్‌లో బస్తర్ జిల్లాలో ఇంద్రావతి నదికి ఉత్తర దిక్కున ఓ తెగ ప్రజలు నివసిస్తున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడం వల్ల బయట వ్యక్తులు ఎవరూ ఇక్కడ అడుగు పెట్టేందుకు సాహసించరు. ఈ తెగలో పెద్దలు తమ పిల్లలకు పెళ్ళిళ్ళు కుదర్చరు. తమకు నచ్చిన భాగస్వామిని వివాహం చేసుకొనే స్వేచ్ఛను పిల్లలకే వదిలేస్తారు. అంతేకాదు.. పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొనేందుకు కూడా అనుమతి ఇస్తారు. ఈ సాంప్రదాయాన్ని ‘గోటుల్’ అంటారు. పెళ్లికి ముందు యువతీ యువకులు తమ భాగస్వామి లైంగిక సామర్థ్యాన్ని తెలుసుకొనేందుకు నచ్చినవారితో ఏకాంతంగా గడపడం గోటుల్ విధానం. ఒక గుడిసెలో ఒక జంట మాత్రమే ఉండాలి. ఆ గుడిసెలో వారు కబుర్లు చెప్పుకోవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు. చివరికి లైంగికంగా కలవచ్చు. వారం రోజులపాటు వారిని ఎవరూ డిస్ట్రబ్ చేయరు. అమ్మాయిలను ఈ గుడిసెల్లోకి పంపే ముందు ప్రత్యేక వేడుక నిర్వహిస్తారు. దాదాపు స్వయంవరం తరహాలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందులో అబ్బాయి.. తనకు నచ్చిన అమ్మాయిని ఎంపిక చేసుకుని సెక్స్‌లో పాల్గొనవచ్చు. అబ్బాయికి అమ్మాయి నచ్చినట్లయితే.. ఆమె తలలో పువ్వు పెట్టాలి. ఆ అబ్బాయి నచ్చితేనే అమ్మాయి తన తలలో పువ్వు పెట్టేందుకు అనుమతించాలి. ఒక వేళ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడకపోతే.. వారు మరొకరిని ఎంపిక చేసుకుని మరో వారం రోజులు గడపవచ్చు.

ఎమోషనల్ అటాచ్మెంట్ లేకుండా శృంగారం:

ఇది కూడా మళ్ళీ ఛత్తీస్ ఘడ్ లోనే జరుగుతోంది. ఇది మరో ట్రైబల్ తెగలోని ఆచారం. ఇక్కడ వాళ్ళంతా ఒక దగ్గరగా ఉండే క్వాటర్స్‌లో నివసిస్తారు. అక్కడ ఎవరికి నచ్చిన వాళ్ళు మరొకరితో శృంగారంలో పాల్గొంటారు. అయితే వీళ్ళల్లో ఏ ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉండదు. ఎమోషనల్ అటాచ్మెంట్ లేకుండా ప్రాక్టీస్‌లో పాల్గొంటారు.

ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చు:

స్వీడన్ దేశంలో ఓ వింత ఆచారం ఉంది. వివాహ రిసెప్షన్‌లో నవ దంపతులు కూర్చున్న చోటు నుంచి పక్కకు వెళితే చాలు. వారిని ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చట. అమ్మాయో లేక అబ్బాయో వారి కుర్చీ నుంచి లేచి బాత్‌రూమ్‌కు వెళ్ళినా సరే. అమ్మాయినైతే అక్కడి పురుషులు, అబ్బాయినైతే మహిళలు నిరభ్యంతరంగా ముద్దు పెట్టుకోవచ్చట.

బెడ్‌రూమ్‌లోకి ఎంట్రీ :

పెళ్లైనాక మొదటి రాత్రి తంతులో కొత్త దంపతులకు తోడుగా ఓ పెద్దావిడను బెడ్‌రూమ్‌లోకి పంపుతారట. ఈ వింత ఆచారం ఆఫ్రికాలోని కొన్ని పల్లెటూళ్ళలో ఉంది. ఆ పెద్దావిడ పెళ్ళి కూతురు తల్లి అయినా కావచ్చట.

నవ్వితే నో మ్యారేజ్ :

కాంగోలో పెళ్ళి ఆచారం గమ్మత్తుగా ఉంటుంది. పెళ్ళి తంతు ముగిసే వరకు పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు నవ్వకూడదట. అలా నవ్వితే అరిష్టంగా భావించి వివాహమే రద్దు చేస్తారట.

నెల రోజుల కఠిన పరీక్ష :

చైనాలో ఓ వింత ఆచారం ఉంది. వివాహానికికి నెల రోజుల ముందు నుంచి ఆ పెళ్ళి కూతురు రోజుకో గంట తప్పకుండా ఏడ్వాల్సిందేనట. అంతేకాదు, పది రోజుల తర్వాత ఆ నవ వధువుకు తోడుగా వాళ్ళ అమ్మ కూడా ఆ ఏడుపులో పాలు పంచుకోవాలి. మరో పది రోజుల తర్వాత ఆమెకు వాళ్ళ అమ్మమ్మ తోడవుతుంది. నెల చివర్లో అమ్మాయి కుటుంబ సభ్యుల్లో మహిళలంతా ఆమెకు సహాయంగా ఏడుస్తారు. అలా ఆడవారి ఏడుపుతో వచ్చే వివిధ రాగాలను పెళ్ళి వారంతా ఆనందిస్తారట.

పెళ్లి చేయాలంటే బ్యాంక్‌కు కన్నం వేయాల్సిందే:

ఫిజీ దేశంలో పెళ్ళి కొడుకు అడిగే లాంఛనాలే వేరు. ఎక్కడైనా అమ్మాయితో పాటు నగోనట్రో పంపమంటారు. కానీ అక్కడి పెళ్లి కొడుకు పిల్లనిచ్చే మామను అమ్మాయితో పాటు తిమింగలం దంతాన్ని అడుగుతాడట. మరి దాన్ని ఇచ్చి పిల్లకు పెళ్ళి చేయాలంటే అమ్మాయి తండ్రి ఆస్తి మొత్తం అమ్మడంతో పాటు దొంగతనాలూ చేయక తప్పదు.

అదండీ సంగతి…చూశారుగా వింత ఆచారాలు, అవాక్కయ్యే పద్ధతులునూ. ఏంటో హాక్ష్ిగా, సింపుల్ గా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇవన్నీను అనిపిస్తోంది కదా ఇది చదువుతుంటే. ఇంత కష్టపడి పెళ్ళి చేసుకుని ఏం సాధించాలని కూడా కదా.