Interestingly England Pak final match
mictv telugu

ఆచితూచి ఆడుతున్న ఇంగ్లాండ్

November 13, 2022

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది. 137 పరుగల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆచితూచి ఆడుతోంది.10 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. సెమీఫైనల్లో అదరగొట్టిన హేల్స్ ఈ మ్యాచ్‎లో మొదటి ఓవర్ లోనే వెనుదిరిగాడు. షాహీన్ అఫ్రిదీ బౌలింగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బట్లర్ (17 బంతుల్లో 26), సాల్ట్ (10) కుదురుకున్నట్టు కనిపించినా స్వల్ప వ్యవధిలోనే ఇద్దరు పెవిలియన్కు చేరడంతో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం క్రీజ్‎లో స్టోక్స్(17), బ్రూక్(14) ఉన్నారు. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే 60 బంతుల్లో 61 పరుగులు చేయాల్సి ఉంది.