మెడిసిన్.. టెక్నాలజీలో ఎంతో పురోగతిని సాధిస్తున్నది. కానీ క్యాన్సర్ మహమ్మారిని మాత్రం తగ్గించలేకపోతున్నారు. ఇందులో సంవత్సరం ఉన్న పిల్లలు కూడా ఈ మహమ్మారికి బలైపోతున్నారు..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15న ఇంటర్నేషనల్ చైల్డ్ హుడ్ క్యాన్సర్ డేని జరుపుతారు. పీడియాట్రిక్ అంకాలజీ అనేది వైద్యంలో ఒక రంగం. ఇది పిల్లల్లో క్యాన్సర్ గురించి పని చేస్తుంది. ఈ డాక్టర్లు.. పిల్లలకు వచ్చే నొప్పులు, హోమ్ కేర్ ఇలా అన్నింటి మీద అవగాహన కలిగిస్తారు.
బాల్యంలో క్యాన్సర్ నిజంగా బాధకరమైనది. అంతేకాదు.. వారికి చేసే ప్రత్యేక చికిత్స, సంరక్షణ కూడా అవసరం. ఈ క్యాన్సర్ పై అవగాహన పెంపొందించడంతో పాటు, కౌమరదశలో ఉన్నవారికి, ఇతర కుటుంబాలకు కూడా ఈ రోజు మద్దతు తెలుపుతున్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీని ప్రకారం.. ప్రపంచంలోని బాల్య క్యాన్సర్ బారిన పడుతున్నది 20శాతం భారత్ దేనని తేలింది. లుకేమియాతో(సుమారు 33శాతం), బ్రెయిన్ ట్యూమర్స్ (సుమారు 20శాతం), లింఫోమాస్ (11శాతం)తో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. కాకపోతే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య తక్కువ.
కొన్ని వాస్తవాలు..
– 99శాతం క్యాన్సర్లు పెద్దవారిలో కనిపిస్తాయి. 285మంది పిల్లల్లో ఒకరికి మాత్రమే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
– ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. భారతదేశంలో ప్రతీ సంవత్సరం దాదాపు 75,000మంది పిల్లలు క్యాన్సర్ తో బాధపడుతున్నారు.
– కణాలు మారినప్పుడు, నియంత్రణ లేకుండా పెరుగడం ప్రారంభించినప్పుడు క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో క్యాన్సర్ కారణం మాత్రం ఈ కారణాలు ఉండకపోవచ్చు.
– 29శాతం లుకేమియా కారణంగా చైల్డ్ హుడ్ క్యాన్సర్ రావచ్చు. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, అక్యూట్ మైలోయిడ్ లుకేమియా అనేవి 15 యేండ్లలోపు పిల్లల్లో ఈ రెండు క్యాన్సర్స్ కచ్చితంగా కనిపిస్తాయి.
– గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ చైల్డ్ హుడ్ క్యాన్సర్ కూడా బాల్య క్యాన్సర్ కు శాశ్వత నివారణల అభివృద్ధి చేయడం పై దృష్టి పెడుతున్నది.