International Mother Language Day Theme, Significance and history 
mictv telugu

అమృతంలాంటి అమ్మ భాషని మరువకూడదు!

February 21, 2023

International Mother Language Day Theme, Significance and history

మనిషి తన భావాలను వ్యక్తపరిచే ఒకే ఒక సాధనం భాష. భూమి పై ఉన్న ఏ ప్రాణికి లేని సౌలభ్యం మనిషికి మాత్రమే ఉంది. తన భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయగలుగుతారు. మరి ఈ రోజు మాతృభాష దినోత్సవం. అమ్మలాంటి కమ్మనైన ఆ మాతృభాష ప్రాముఖ్యత ఏంటో తెలుసా? మనిషి ముందుగా నేర్చుకునేది మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు పాఠశాల. ఎవరూ చెప్పకుండానే వచ్చేది మాతృభాష. అందుకే మన మాతృభాషను కాపాడుకోవాలి. మన మనుగడ సాఫీగా సాగాలంటే భాషను మరువకూడదు.

అమ్మ పలుగులోని అప్యాయత ఎలాగ ఉంటుందో మాతృభాషలోని మాధుర్యం కూడా అలాగ ఉంటుంది. మనసులో భావాలను వ్యక్తం చేయాలంటే మాతృభాషకు మించింది ఉండదు. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుతారు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. 1956.. తూర్పు పాకిస్తాన్.. నేటి బంగ్లాదేశ్ లోని యూనివర్సిటీ విద్యార్థులు తమ మాతృ భాషలో బోధనలు చేయాలని ఉద్యమించారు. అంటే.. బెంగాలీలోనే అక్కడ బోధనలు సాగాలని పెద్ద పోరాటమే జరిగింది. హింస చెలరేగి పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారు చేసిన త్యాగ ఫలితంగానే 1999 ఫిబ్రవరి 21 నుంచి అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం జరుగుతున్నది.

తెలుగు భాష గొప్పదనం..
భారతదేశంలో 1,652 భాషలున్నాయి. వాటిలో 16 భాషలకు మాత్రమే లిపి ఉంది. మిగిలిన అన్ని భాషలకు వారి వారి మాండలికాలున్నాయి. అయితే మనదేశంలో 57అక్షరాలు, 3 ఉభయ అక్షరాలు ఉన్న తెలుగు ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్ద మాతృభాషగా గుర్తింపు పొందింది. హిందీ తర్వాత తెలుగు మాట్లాడే వారు మన దేశంలో ఎక్కువ ఉన్నారని తేలింది. అయితే 30శాతం మంది పిల్లలు మాతృభాషను నేర్చుకోవడం మానేస్తున్నారట. అందువల్ల చాలా మాతృభాషలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఏడాది..
మాతృభాషా దినోత్సవం వేళా యునెస్కో ప్రతీ సంవత్సరం ఒక ముఖ్యమైన అంశాన్ని థీమ్ గా తీసుకుంటుంది. ఈ సంవత్సరం.. ‘బహుభాషా విద్య.. విద్యను మార్చడానికి ఒక ఆవశ్యకత’ని తీసుకున్నారు. ఇది స్వదేశీ విద్యను, భాషను నేర్పించాలనేది ప్రమాణంగా పెట్టుకున్నది. ఈ రోజున పారిస్ లో ఉన్న యునెస్కో కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. సెమినార్లు, వర్క్ షాప్స్ కూడా జరుగుతుంటాయి. దీనివల్లనైనా మాతృభాష మీద మక్కువ ఏర్పడుతుందని యునెస్కో భావిస్తుంది.