నిత్యానంద ఇక దొరికేస్తాడు.. ఇంటర్‌పోల్ నోటీస్ వచ్చేసింది..   - MicTv.in - Telugu News
mictv telugu

నిత్యానంద ఇక దొరికేస్తాడు.. ఇంటర్‌పోల్ నోటీస్ వచ్చేసింది..  

January 22, 2020

Interpoll Issued blue Notice against nityananda.

రేప్, లైంగిక వేధింపుల వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి ఆచూకీ కోసం ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేసింది. గత ఏడాది ఆయన భారత్ నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. కొందరు అమ్మాయిలను కిడ్నాప్ చేసి అహ్మదాబాద్‌లోని తన ఆశ్రమంలో వారిని బందీలుగా చేశాడన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న నిత్యానంద ఆచూకీ కనుగొనడం కోసం గుజరాత్ పోలీసులు కసరత్తులు వేగవంతం చేశారు. అతని ఆచూకి కనుగొనడంలో గానీ, ఇతనికి సంబంధించిన సమాచారం గానీ తెలియజేసి తమకు తోడ్పడవలసిందిగా పోలీసులు ఇంటర్‌పోల్‌ను అభ్యర్థించారు. 

గత డిసెంబరులో ప్రభుత్వం నిత్యానంద పాస్‌పోర్టును రద్దు చేసింది. ఇతని ఆచూకీని కనుగొనడంలో సాయపడాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఆ మధ్య విదేశాల్లోని రాయబార కార్యాలయాలను కోరారు. ఈ విషయమై తనను ఎవరూ టచ్ చేయలేరని, ఎవరూ ప్రాసిక్యూట్ చేయలేరని నిత్యానంద చెప్పాడు. పైగా తను పరమశివుడినని, తనది కైలాసమని, ఇదో పెద్ద హిందూ దేశమని కోతలు కోశాడు. ఆ తర్వాత మాయమై, తానొక దీవిని కొనుక్కున్నానని నిత్యానంద చేసిన వ్యాఖ్యలను ఈక్వెడార్ ఖండించింది. కాగా, రేప్ ఆరోపణల నేపథ్యంలో 2010లో నిత్యానందను హిమాచల్‌ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక నటితో ఇతగాడు సన్నిహితంగా ఉన్న ఫుటేజీ బయటపడిన విషయం గమనార్హం.