Home > Featured > జాతుల మధ్య ఘర్షణ.. 230 మంది ఊచకోత

జాతుల మధ్య ఘర్షణ.. 230 మంది ఊచకోత

Interracial conflict in Ethiopia

ఆఫ్రికా దేశమైన ఇథియోపియా జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతోంది. తాజాగా జరిగిన ఘర్షణల్లో దాదాపు 230 మంది అమ్హారా తెగ ప్రజలు మృతిచెందారు. ఇథియోపియన్ తిరుగుబాటు దళాలు ఈ ఘాతుకానికి పాల్పడింది. దేశంలోని అతిపెద్ద ప్రాంతమైన ఒరోమియాలో ఈ దారుణం చోటుచేసుకుంది. తమ జీవితంలో ఇంత ఘోరమైన ఘటనను చూడడం ఇదే మొదటిసారి అంటూ ప్రత్యక్ష సాక్షులు వాపోతున్నారు. తాజా ఘటన నేపథ్యంలో తమను మరో చోటికి తరలించాలని అమ్హారా తెగ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాగా, రెండో అత్యధిక జనాభా కలిగిన ఆఫ్రికా దేశంగా గుర్తింపు పొందిన ఇథియోపియాలో జాతుల మధ్య గొడవలు, ఘర్షణలు సహజంగా జరుగుతుంటాయి.

Updated : 20 Jun 2022 4:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top