బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ రాబోంతుందని తెలిపారు. ఈ కొత్త పార్టీ కేసీఆర్ కనుసన్నల్లోనే పనిచేయనుందని వెల్లడించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై విమర్శించారు. ఇరు రాష్ట్రాల సీఎంలు పాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. విభజనలపై కేంద్రం సమావేశాలు నిర్వహిస్తే తెలంగాణ నుంచి ఎవరూ హాజరు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహనలో భాగంగానే కృష్ణా, గోదావరి మేనేజ్మెంట్ మీటింగ్లకు ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరుకావటం లేదని తెలిపారు.నీటి పంపకాల అంశాలన్ని జగన్, కేసీఆర్ పక్కనబెట్టేశారని ఆరోపించారు. ఇద్దరు సీఎంల తీరు ప్రజలకు శాపమైందని ఎన్వీఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఠాగూర్ వెళ్లినా… ఠాక్రే వచ్చినా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుందన్నారు. కేసీఆర్ సూచనలమేరకు కమ్యూనిష్టులు బీజేపీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.