అకారణంగానే నన్ను టార్గెట్ చేశారు.. సునీత ఎమోషనల్ పోస్టు - MicTv.in - Telugu News
mictv telugu

అకారణంగానే నన్ను టార్గెట్ చేశారు.. సునీత ఎమోషనల్ పోస్టు

May 10, 2020

Tollywood, Singer, Sunitha, Emotional Post, Facebook, Social Media

ప్రముఖ టాలీవుడ్ నేపథ్య గాయని సునీత ‘కారణం లేకుండా నన్ను టార్గెట్ చేశారు’ అంటే ఫేస్‌బుక్‌లో ఎమోషనల్ పోస్టు పెట్టారు.  ‘కారణం లేకుండానే అతి సులభంగా నన్ను టార్గెట్‌ చేసిన వారిని చూశాను. జూనియర్‌ సింగర్స్‌ నన్ను దారుణంగా ఇమిటేట్‌ చేయడం చూశాను. ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం నేను చూశాను. నా గురించి గాసిప్ చేయడానికి వాట్సాప్ గ్రూపులు సృష్టించబడటం నేను చూశాను. కొన్ని వెబ్‌సైట్లు నా గురించి అర్ధంపర్థంలేనివి రాయడం నేను చూశాను. వారి అభద్రతాభావంతో ప్రజలు నన్ను అకస్మాత్తుగా విడిచిపెట్టడాన్ని నేను చూశాను. నా వ్యక్తిగత జీవితం గురించి మహిళలు హానికరమైన పుకార్లు వ్యాప్తి చేయడాన్ని నేను చూశాను. విజయాలు, అపజయాలు చూశాను, మౌనంగా ఉంటూ జీవితానికి సరిపడా చేసేశా. పిల్లలను ఆధిపత్యంగా పెంచడం ఎంత కష్టమో నేను చూశాను. అదే సమయంలో పురుషాధిక్య సమాజాన్ని ఎదుర్కొంటూ ఒంటరిగా పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో నాకు తెలుసు. మొత్తానికి నేను జీవితాన్ని చూశాను. ఇవన్నీ నా జీవితాన్ని మరింత అర్ధవంతం చేస్తాయి’ అని సునీత పోస్టులో రాసుకొచ్చారు. 

నేడు (ఆదివారం) ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ‘ఇవాళ నన్నెంతో అభిమానించేవారు నాకోసం ఒక్కటయ్యారు. నా పని తీరును గుర్తుచేసి అభినందించారు. నా ఉనికికి కారణం చెప్పారు. వీరంతా కలిసి నా జీవితానికి మరింత అర్థం తెచ్చారు. మీ అందరికీ నా ధన్యవాదాలు’ అని సునీత తెలిపారు. కాగా, ఆమె పోస్టుకు నెటిజన్లు స్పందిస్తున్నారు. సినీ ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. మీనుంచి ఇంకా హిట్ పాటలు రావాలని కోరుకుంటున్నాం అని చెబుతున్నారు.