ఇక్కడ మిడతల దండు..అక్కడ రక్తపిశాచాల దండు - MicTv.in - Telugu News
mictv telugu

ఇక్కడ మిడతల దండు..అక్కడ రక్తపిశాచాల దండు

June 2, 2020

Invasion of mutant blood-sucking ticks hits Russia

కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతోన్న తరుణంలో కొత్త కొత్త విపత్తులు ప్రజలను వణికిస్తున్నాయి. ఇటీవల తూర్పు ఆఫ్రికా, ఇరాన్, సౌదీ అరేబియా, ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్‌పై మిడతల దండు దండెత్తిన సంగతి తెల్సిందే. తాజాగా రష్యాలో మనుషుల రక్తాన్ని పీల్చి చంపే, అలాగే పిల్లల్లో మెదడు వాపు వ్యాధిని కలిగించే పినుజులు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. క్రాస్నోయార్స్క్ ప్రాంతంలో ఇప్పటికే 8,215 పినుజు కాటు కేసులు నమోదయ్యాయి. వీరిలో 2,125 మంది పిల్లలు ఉండడం విషాదకరం. సెర్‌డ్లోస్క్ ప్రాంతంలో 17,242 పినుజు కాటు కేసులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు.

సాధారణంగా చదరపు కి.మీ.కు 0.5 పినుజులు ఉంటాయి. సైబీరియా ప్రాంతంలో సాధారణం కంటే 428 రెట్లు అధికంగా పినజులు కనిపిస్తున్నాయి. అలాగే క్రాస్నోయార్స్క్ ప్రాంతంలో ప్రతి చదరపు కి.మీ. సగటున 214 పినజులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే కరోనా కేసుల్లో టాప్ 3లో ఉన్న రష్యాకు.. ఇప్పుడు పినుజుల రూపంలో మరో ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోకపోతే భారీ ప్రాణనష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.