దర్యాప్తు ముమ్మరం.. జగన్ బంధువులను ప్రశ్నించనున్న సిట్ - MicTv.in - Telugu News
mictv telugu

దర్యాప్తు ముమ్మరం.. జగన్ బంధువులను ప్రశ్నించనున్న సిట్

March 17, 2019

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఏపీ రాజకీయ వర్గాల్లో పెను తుఫానునే రగిల్చింది. ఆయనది సహజమరణం కాదని, హత్య అని వైద్యులు తెలిపారు. అయితే ఆయనను ఎవరు, ఎందుకు హత్య చేశారు అనే కోణంలో సిట్ అధికారులు చాలా సీరియస్‌గా వున్నారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. దోషులు ఎవరైనా వదిలేది లేదని అంటున్నారు. వివేకా హత్యపై జగన్‌ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని సిట్ అధికారులు తెలిపారు.

Investigation is intolerant .. Sitt to question Jagan's relatives

ఈ క్రమంలో హత్యలో అనుమానితులుగా భావిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ జగన్‌ బంధువులను కూడా సిట్‌ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలపైనా సిట్ దృష్టి సారించింది. వివేకానందరెడ్డి కాల్స్‌ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. వివేకా హత్య ఘటనా స్థలంలో దొరికిన లేఖను అధికారులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. రెండు రోజుల్లోనే కేసును ఛేదిస్తామని పోలీసులు పేర్కొన్నారు.