ఏపీ సీఎం సంచలన నిర్ణయం..చంద్రబాబు పాలనపై విచారణ  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ సీఎం సంచలన నిర్ణయం..చంద్రబాబు పాలనపై విచారణ 

February 22, 2020

Investigation on Chandrababu Ruling

ఏపీ ప్రభుత్వం మరో సంచలనానికి తెరలేపింది. గతంలో చంద్రబాబు పాలన, అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణకు సిద్ధమైంది. దీని కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కూడా ఏర్పాటు చేసింది. నిఘా విభాగం డీఐజీ కొల్లి రఘురాంరెడ్డి నేతృత్వంలో దీన్ని ఏర్పాటు చేశారు. గతేడాది  జూన్ 26న మంత్రివర్గ ఉప సంఘం బాబు ఐదేళ్ల పాలనలో అక్రమాలు జరిగాయని పేర్కొంది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై సిట్‌తో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ విచారణ బృందం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు,సీఆర్‌డీఏ పరిధిలో భూముల కేటాయింపులను  సమీక్షించనుంది. ప్రాజెక్టులకు విడుదలైన నిధులు, ఇతర పథకాలపై కూపీలాగనున్నారు. సిట్ విచారణ కోసం ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లను ఏర్పాటు చేశారు. సిట్ ఏ అధికారినైనా పిలిపించి వాంగ్మూలం రికార్డు చేసుకునే అధికారం ఉండేలా ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. కాగా ఇప్పటికే గత పాలకులపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సమయంలో పూర్తి విచారణ కోసం ఏకంగా సిట్ ఏర్పాటు చేయడం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.