తెలంగాణలో.. పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు ఆహ్వానం - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో.. పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు ఆహ్వానం

May 12, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగుల విద్యార్థులకు శుభవార్త చెప్పింది. పోస్ట్‌ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. కొత్తగా, రెన్యువల్ స్కాలర్‌షిప్స్ కోసం విద్యార్థులు ఈనెల 21లోగా ఈ- పాస్‌లో దరఖాస్తులు చేసుకోవాలని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అధికారుల వివరాల ప్రకారం..”2021-22 విద్యా సంవత్సరానికి పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం ప్రభుత్వం గత సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు దరఖాస్తులను స్వీకరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీఎస్సీ, ఎమ్మెస్సీ, జీఎస్ఎం తదితర వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఆయా కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సౌకర్యార్థం పోస్టమెట్రిక్ స్కాలర్‌షిప్స్‌లకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించాం. ఈ-పాస్ వెబ్‌సైట్‌ను మే 11 నుంచి 21 వరకు తెరవాలని నిర్ణయించింది. ఇప్పటికీ దరఖాస్తులు చేసుకోని, వివరాలను పొందుపరచని విద్యాసంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.”